Jobs: యుపీఎస్‌సీలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..
Jobs: లెక్చరర్ పోస్టులు వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, గృహ శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, జంతుశాస్త్రం వంటి వివిధ విభాగాలలో ఉన్నాయి.

Jobs
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్‌లో మూడు రకాల పోస్టులు(Jobs) ఉన్నాయి:
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 19 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్: 25 పోస్టులు
లెక్చరర్: 40 పోస్టులు
లెక్చరర్ పోస్టులు వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, గృహ శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, జంతుశాస్త్రం వంటి వివిధ విభాగాలలో ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ఎంపికైనవారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో పని చేయాల్సి ఉంటుంది.

అర్హతలు, జీతాలు మరియు దరఖాస్తు గడువు.. పోస్టును బట్టి, అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి. గరిష్ఠ వయోపరిమితి 45 సంవత్సరాలు.
ఈ ఉద్యోగాల(Jobs)కు ఆకర్షణీయమైన జీతాలు ఉన్నాయి. లెక్చరర్ పోస్టులకు- నెలకు రూ. 52,700 నుంచి రూ. 1,66,700, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు: నెలకు రూ. 56,100 నుంచి రూ.1,77,500, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు: నెలకు రూ. 44,900 నుంచి రూ. 1,42,400
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 11, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇది ఒక అరుదైన అవకాశం.
One Comment