HealthJust LifestyleLatest News

Health risks: డీజే సౌండ్‌, డ్యాన్స్‌తో గుండెకు ముప్పెందుకు?

Health risks: ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కూలబడి, గుండెపోటుతో మరణించిన సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తు న్నాయి.

Health risks

గణేశ్‌ నిమజ్జన వేడుకలు, పండుగ, పెళ్లి ఊరేగింపులు అంటేనే యువతలో, మధ్యవయస్కుల్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. డీజే సౌండ్స్‌కి డ్యాన్స్ చేస్తూ, ఆనందంగా గెంతుతూ గడిపే ఈ క్షణాలు కొన్నిసార్లు విషాదంగా మారుతున్నాయి. ఊరేగింపులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కూలబడి, గుండెపోటుతో మరణించిన సంఘటనలు(Health risks) దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తు న్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ ఉత్సాహం వెనుక దాగి ఉన్న ప్రమాదాలేమిటి?

ఈ హఠాత్ సంఘటనలకు ప్రధాన కారణం శారీరక శ్రమ , అధిక శబ్దం. చాలామంది యువకులు, మధ్య వయస్కులు రోజూ ఎలాంటి వ్యాయామం చేయరు. కానీ పండుగల్లో డీజే పాటలకు అకస్మాత్తుగా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తూ, వేగంగా డ్యాన్స్ చేస్తారు. ఇలాంటి హఠాత్ శ్రమ గుండెకు షాక్ ఇచ్చినట్లుగా ఉంటుంది. గుండె తన సాధారణ వేగం కంటే చాలా వేగంగా పనిచేయాల్సి వస్తుంది.

దీనికి తోడు, డీజేల నుంచి వచ్చే అధిక శబ్దం, లౌడ్ బేస్ బీట్స్ మన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం(Health risks) చూపుతాయి. ఇది రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. గుండె ఇప్పటికే శారీరక శ్రమతో ఒత్తిడికి గురైనప్పుడు, ఈ అధిక శబ్దం మరింత భారాన్ని పెంచుతుంది. ఒకేసారి రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.

మనం బయటకు ఆరోగ్యంగా కనిపిస్తున్నా, లోపల మన శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఆరోగ్యానికి హానికరం అయిన ఆహారం, పొగత్రాగడం, మద్యం వంటి అలవాట్లు గుండెను బలహీనపరుస్తాయి. ఇలాంటి అలవాట్లు ఉన్నవారు, తమకు గుండె సమస్యలు ఉన్నాయని తెలియకుండానే, పండుగ ఉత్సాహంలో ప్రమాదానికి గురవుతున్నారు.

Health risks
Health risks

డాక్టర్లు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఏమాత్రం ముందుగా సిద్ధం లేని శరీరంపై, ఒకేసారి హఠాత్ భారం పడితే గుండె తీవ్ర(Health risks) ఒత్తిడికి లోనవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. సెల్ఫ్-అవగాహన, సాధారణ వైద్య పరీక్షలు లేకపోవడం కూడా ఈ ప్రమాదాలను పెంచుతోంది.

ఇలాంటి ప్రమాదాన్ని అరికట్టడానికి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్లకు ముందు, పూర్తి గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.డీజే సౌండ్ వాల్యూమ్‌ను తగ్గించాలి. ప్రభుత్వాలు శబ్ద కాలుష్య నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.డ్యాన్స్ చేసేటప్పుడు ఊపిరి అందకపోవడం, ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే ఆగి విశ్రాంతి తీసుకోవాలి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే బలవంతంగా శ్రమించకూడదు.

పండుగ రోజుల్లో కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేడుకల్లో డ్యాన్స్‌కు దూరంగా ఉండటం మంచిది.పండుగలు మన జీవితంలో ఆనందాన్ని నింపుతాయి. కానీ ఆ ఆనందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. డీజే సౌండ్స్, హఠాత్ శారీరక శ్రమ, ఆరోగ్య నిర్లక్ష్యం వల్ల వచ్చే ప్రమాదాలను ఎప్పటికీ చిన్నగా చూడకూడదు.

Jobs: యుపీఎస్‌సీలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button