Just NationalJust PoliticalLatest News

NDA government: బీహార్‌లో నితీశ్ నాయకత్వంలో నూతన ఎన్డీయే సర్కార్ కొలువు..

NDA government :బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, సామ్రాట్ చౌదరి , విజయ్ కుమార్ సిన్హా, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

NDA government

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఎన్డీయే (NDA government) కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, మొత్తం 26 మంది మంత్రులతో కేబినెట్ కొలువుదీరింది.

నితీశ్ కుమార్- పదోసారి ముఖ్యమంత్రి..నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి కావడం ఒక అరుదైన రికార్డు. ఈ ప్రమాణస్వీకారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగింది. ఎన్నికల్లో మొత్తం 243 సీట్లకుగాను, ఎన్డీయే కూటమి(NDA government) అఖండ మెజారిటీతో 202 సీట్లు దక్కించుకుంది. ఇందులో బీజేపీ 101 సీట్లు, జేడీ(యూ) 85 సీట్లు గెలుచుకున్నాయి.

బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, సామ్రాట్ చౌదరి , విజయ్ కుమార్ సిన్హా, ఉప ముఖ్యమంత్రులుగా (డిప్యూటీ సీఎంలుగా) ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ముఖ్యమంత్రులు హాజరై, తమ మద్దతును తెలిపారు.

NDA government
NDA government

నితీశ్ కేబినెట్‌లో మొత్తం 26 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మంత్రివర్గ కూర్పులో కూటమి భాగస్వాముల మధ్య మంత్రి పదవుల పంపకం జరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి అత్యధికంగా 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంగళ్ పాండే, నితిన్ నబిన్, రామ్ కృపాల్ యాదవ్ వంటి ముఖ్య నాయకులు ఉన్నారు.

NDA government
NDA government

జనతా దళ్ (యునైటెడ్) (జేడీ(యూ)) నుంచి 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు, వీరిలో విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరి, లేషి సింగ్ ముఖ్యులు. మిగిలిన 4 మంత్రి పదవులను ఇతర భాగస్వామ్య పక్షాలకు కేటాయించారు: లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) (LJP-RV) నుంచి ఇద్దరు, హెచ్.ఎ.ఎం (ఎస్) (HAM(S)) నుంచి ఒకరు, ఆర్.ఎల్.ఎం (RLM) నుంచి ఒకరు మంత్రి పదవులను పొందారు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button