Child’s future:మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఒకే యాప్‌లో..ఎలాగంటే..
Child's future:ఈ డిజిటల్ విప్లవం ఇప్పుడు భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెల్లగా విస్తరిస్తోంది.

Child’s future
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను స్కూలుకు పంపేటప్పుడు ఆ గుమ్మం దాటిన తర్వాత ఏం జరుగుతుందో(Child’s future) తెలుసుకోవాలనే ఆరాటపడతారు. హోంవర్క్ చేశాడా? టీచర్‌తో ఎలా ప్రవర్తించాడు? మార్కులు ఎలా వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఉపాధ్యాయులను కలవడమో, ఫోన్ చేయడమో తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక స్మార్ట్ స్కూల్ యాప్‌తో, ఆ తల్లిదండ్రుల ఆశ(Child’s future) నెరవేరుతుంది. ఇది కేవలం ఒక యాప్ కాదు, స్కూలుకు, ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ఒక డిజిటల్ వారధిగా నిలుస్తుంది..
ఈ డిజిటల్ విప్లవం ఇప్పుడు భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెల్లగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘సమగ్ర శిక్ష’ మిషన్ కింద స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ యాప్‌ల కోసం నిధులు విడుదల చేస్తూ ఈ మార్పును ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా సాంకేతిక ప్రయోజనాలను పొందుతున్నారు.
Dry fruits: ఈ మూడు డ్రై ఫ్రూట్స్ ఎన్నో జబ్బుల నుంచి కాపాడతాయట.. అందుకే డైలీ తినండి
ఉదాహరణకు, గుజరాత్‌లో “గ్యాంకుంజ్” ప్రాజెక్టు ద్వారా 2.85 లక్షల ప్రభుత్వ విద్యార్థులు డిజిటల్ తరగతుల ప్రయోజనం పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో “మేరా స్కూల్, స్మార్ట్ స్కూల్” పేరుతో 1,442 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, మొబైల్ యాప్‌లను ప్రవేశపెట్టారు. ఇక ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ‘స్మార్ట్ స్కూల్, స్మార్ట్ బ్లాక్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక బోధన అందుతోంది.

అయితే ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ ట్రెండ్‌లో ముందున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర , కర్ణాటక వంటి అనేక రాష్ట్రాల్లో స్కూల్ ప్లస్( SCHOOL PLUS), ఎడ్యుకేస్ (EDUCASE), విద్యాలయ(VIDYALAYA )వంటి యాప్‌లు విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. ఈ యాప్‌లు కేవలం నోటిఫికేషన్లు పంపడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒకే స్క్రీన్‌పై విద్యార్థి హాజరు శాతం, రోజువారీ హోంవర్క్ వివరాలు, ఫీజు చెల్లింపు స్టేటస్ మరియు పరీక్షల టైమ్‌టేబుల్ వంటి అన్ని సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ సౌలభ్యం పాఠశాల నిర్వహణను పూర్తిగా డిజిటల్ మార్గంలోకి మార్చేసింది.
ఈ స్మార్ట్ యాప్‌లు కేవలం సమాచార మార్పిడికి మాత్రమే కాకుండా, పిల్లల భద్రతకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఫీల్డ్ ట్రిప్‌లకు వెళ్లినప్పుడు వారి లొకేషన్‌ను లైవ్ ట్రాక్ చేయగలగడం తల్లిదండ్రులకు ఎంతో భద్రతా భావాన్ని, ప్రశాంతతను ఇస్తోంది. ఇక అధునాతన ఫీచర్లైన డిజిటల్ అసెస్‌మెంట్ ద్వారా పిల్లల బలహీనతలు, వారి ప్రతిభను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించేలా రిపోర్టులు అందిస్తున్నాయి.
Graduates: డబ్బులిచ్చి ఆఫీసులకు వెళ్తున్న అక్కడి గ్రాడ్యుయేట్లు..
పాఠశాల యాప్‌లు తల్లిదండ్రులకు కొత్త రకమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఒకప్పుడు ‘బ్యాక్-టు-స్కూల్ యాంగ్జైటీ’ ఉండేది, ఇప్పుడు ‘యాప్-టు-స్కూల్ యాంగ్జైటీ’ వచ్చింది. వర్చువల్ పేరెంట్-టీచర్ మీటింగ్స్‌తో పాటు, పిల్లలు ఇంటి వద్ద చేసే హోంవర్క్, క్లాస్ టెస్ట్ రిజల్ట్స్ కూడా రాత్రుల్లో నోటిఫికేషన్ల రూపంలో అందుబాటులో ఉంటున్నాయి.
ఇది పిల్లలను కూడా ఉత్సాహపరుస్తోంది. యాప్‌లో స్కూల్ ఫోటోలు లేదా వారి ఆర్ట్ గ్యాలరీని అప్‌లోడ్ చేస్తే వారు తాము ఒక స్టార్‌లా భావిస్తున్నారు. వర్చువల్ క్లాసులు, ఇంటరాక్టివ్ గేమ్స్, AI-ఆధారిత గైడెన్స్ వంటివి పిల్లల చదువులో మరింత స్ఫూర్తిని నింపుతున్నాయి.మొత్తంగా, ఈ స్మార్ట్ స్కూల్ యాప్‌లు కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, నేటి విద్యారంగంలో ఒక సాంస్కృతిక మార్పు అనే చెప్పొచ్చు.