Dry fruits: ఈ మూడు డ్రై ఫ్రూట్స్ ఎన్నో జబ్బుల నుంచి కాపాడతాయట.. అందుకే డైలీ తినండి
Dry fruits:పోషకాల గనిలాంటి ఈ నట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయంటున్నారు..

Dry fruits
మనం రోజూ తినే ఆహారంలో కేవలం మూడు రకాల డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే చాలు.. మన రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాల గనిలాంటి ఈ నట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయంటున్నారు..
డ్రై ఫ్రూట్స్(Dry fruits)లో మొదటిది, బ్రెయిన్ ఫుడ్ అని పిలువబడే వాల్‌నట్స్. ఇవి చూడటానికి మెదడును పోలి ఉంటాయి. వాటి ఆకారమే కాదు, అవి మెదడుకు చేసే మేలు కూడా అసాధారణమైనది. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది.
AP : వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలోనే వివరాలు
వంద్యత్వ సమస్యలతో బాధపడే పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్, డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడంలో వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శక్తివంతంగా పనిచేస్తాయి. కేవలం ఐదు వాల్‌నట్స్ రోజూ తినడం వల్ల ఒక గ్లాసు పాలు తాగినంత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రెండోది, పోషకాలతో నిండిన పిస్తా. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పిస్తాలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, బరువు తగ్గాలనుకునేవారికి స్నాక్‌గా ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా పిస్తాలో ఉండే ల్యూటిన్, జియాక్సాంథిన్ అనే పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

డయాబెటిస్‌తో బాధపడేవారు వీటిని (Dry fruits)తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. గుండె జబ్బులను నివారించడంలోనూ, కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలోనూ పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది.
Diabetes: డయాబెటిస్‌కు దంత సమస్యలు తోడవ్వాల్సిందేనా? ముందే చెక్ పెట్టలేమా?
మూడవది, ప్రతి ఇంట్లో కనిపించే ఆరోగ్య చిరునామా బాదంపప్పు. బాదంలో ప్రొటీన్, విటమిన్-ఇ, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బాదంపప్పులను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినడం వల్ల వాటి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతారు. ఎందుకంటే, నానబెట్టడం వల్ల బాదంపై ఉండే టాక్సిక్ పదార్థాలు తొలగిపోయి, జీర్ణక్రియ సులభమవుతుంది.
దీనిలోని విటమిన్-ఇ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నిత్యం నానబెట్టిన బాదం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్(dry fruits)ను మీ డైలీ డైట్‌లో భాగం చేసుకుంటే, మీ ఆరోగ్యంపై మీరు చేయగలిగిన అతిపెద్ద పెట్టుబడి అదే అవుతుంది.
మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి