Just PoliticalJust NationalLatest News

Bihar Elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీనే.. ఎడ్జ్ ఎవరికంటే ?

Bihar Elections 2025

దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections 2025)షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఒకవిధంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం జాతీయ పార్టీలపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ మరోసారి పాగా వేసేందుకు సిద్ధమవుతుండగా.. ఈ సారి అధికారాన్ని ఒడిసిపట్టుకోవాలని కాంగ్రెస్ కూటమి పట్టుదలగా ఉంది.బిహర్ లో కుల ఓటు బ్యాంకులు, తటస్థ ఓటర్ల నిర్ణయం కీలక పాత్ర పోషిస్తాయి. ఈసీ షెడ్యూల్ ను విడుదల చేయక ముందు సర్వేల్లో మహాఘట్‌బంధన్‌కు విజయావకాశం ఉన్నట్లు ఒపీనియన్‌ పోల్స్‌ వచ్చాయి. కానీ మార్పులు జరుగుతుంటాయన్న నానుడిని నిజయం చేస్తూ ఇటీవలి మార్పులు ఎన్‌డీఏకు అనుకూలంగా మారుతున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ,జేడీయూ ఉండగా… ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ ఆర్‌జేడీ,కాంగ్రెస్‌ల కలయితో ఉంది. రానున్న ఎన్నికల్లోనూ ఈ రెండు కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, సీటు పంపిణీలో పార్టీలు తలమునకలై ఉన్నాయి. కూటమిగా ఏర్పడడంతో సీట్ల కోసం అభ్యర్థులు గట్టిగానే తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. బిహార్ (Bihar Elections 2025)లో నవబంర్ 6న తొలి దశ పోలింగ్ జరగనుంది.

Bihar Elections 2025
Bihar Elections 2025

వీటిలో నలంద, బక్సర్, చాప్రా, పట్నా దర్భంగా, ఆరా, బిహార్‌, షరీఫ్ వంటి ప్రాంతాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఈ జిల్లాల్లో బీజేపీ, జేడీయూ కూటమికి గట్టి పట్టుంది. రెండో దశలో పోలింగ్ జరిగే రక్సాల్, సుపౌల్, కటిహార్, కిషన్‌గంజ్, పూర్ణియా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం జనాభా ఆధిక్యత ఉంది. దీంతో మొదటి దశ పోలింగ్ (Bihar Elections 2025)లో ఎన్డీఎకు, రెండో దశ పోలింగ్ మహాఘట్‌బంధన్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు.

ఓవరాల్ గా ప్రీ పోల్ సర్వేల్లో ఎన్డీఎ, మహాఘట్‌బంధన్‌ మధ్య హోరాహోరీ పోరు ఖాయమని తేలింది. కాస్త ఎడ్జ్ మాత్రం ఎన్డీఏ కూటమికే ఉన్నట్టు సమాచారం. నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన డీబీడీ స్కీమ్ ఓటర్లను బాగా ఆకట్టుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బిహార్ లో కుల ఓటు బ్యాంకులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్రగా ఉంటాయి. మహాఘట్‌బంధన్‌కు ముస్లిం, యాదవులు ప్రధాన మద్దతుగా ఉంటున్నారు. అయితే చదువుకున్న యువ యాదవులు మాత్రం ఎన్డీఏ వైపే మొగ్గుచూపుతున్నారు. అటు కొన్ని చిన్నపార్టీలు ఓట్ల బ్యాంకును చీల్చడం ఖాయం.

Bihar Elections 2025
Bihar Elections 2025

పైగా ప్రశాంత్‌ కిశోర్‌ జన్‌ సురాజ్‌ పార్టీకి ఆదర|ణ 10 శాతం నుంచి 6కి తగ్గిపోవడంతగ్గడం ఎన్‌డీఏకు అనుకూలించే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగుతుండడం ఆ పార్టీ కూడా ఓటు బ్యాంకును చీల్చే అవకాశముంది. . ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి పైగా స్థానాల్లో విజేతలు 2 నుంచి 3 వేల మెజారిటీతోనే బయటపడ్డారు. ఈ సారి తక్కువ మెజారిటీలతోనే ఎక్కువ స్థానాల్లో విజేతలు డిసైడ్ కాబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద బిహార్ లో ఎన్డీఏ కూటమి కోసం మోదీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి రాహుల్, ప్రియాంక వంటి అగ్రనేతలు రంగంలోకి దిగుతుండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Water: బాడీ హైడ్రేట్ అవకుండా నీళ్లే కాదు వీటిని కూడా తీసుకోండి..

Related Articles

4 Comments

  1. WinHQPH, eh? Checked it out and the user interface looks clean and easy to navigate and also it’s quite smooth so it wouldn’t hinder your experience. Give it a whirl: winhqph

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button