Minister Ponnam Prabhakar: కేబినెట్ నుంచి పొన్నం ఔట్ ? కారణాలు అవేనా?
Minister Ponnam Prabhakar: పొన్నంకు సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలు ఈ దందా చూసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెహికల్ ఇన్స్పెక్టర్సు, ఇతర అధికారుల బదిలీలకు భారీగా వసూలు చేశారని ఆరోపణలున్నాయి.
Minister Ponnam Prabhakar
తెలంగాణ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు విస్తరిస్తారనేది తెలియకున్నా పలు కీలక పరిణామాలు, సంచలన నిర్ణయాలు తప్పవని భావిస్తున్నారు. ప్రస్తుతం రవాణా , బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar)కు ఉద్వాసన పలుకుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో వ్యక్తిగత విభేదాలు, నోటి దురుసు వంటివి కారణాలుగా చెబుతున్నారు.పైగా క్యాబినెట్లో పొన్నం ఒంటరి అయిపోయారు.
ఆయనకు మద్దతుగా ఎవరూ ముందుకు రావడం లేదు. పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై , మంత్రి అయ్యారు.2009లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన సహచరుడు కేవీపీ రామచంద్ర రావు చలవతో ఎంపీగా ఎన్నికైన పొన్నం… కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో గొప్ప త్యాగాలు ఏమి చేయకపోయినా… అవసరాన్ని బట్టి తెలంగాణ వాదాన్నివినిపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొన్నం వాయిస్ తగ్గిపోయింది. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఆ పార్టీతోనే నెట్టుకొచ్చారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకానొక సమయంలో ఆయనకు సీటు కూడా రాలేదు. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్ హై కమాండ్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సీటు తెచ్చుకున్నారు.

బి ఆర్ఎస్ యాంటీ వేవ్ లో చాలామంది ఊహించని విధంగా గెలిచారు. వాళ్లలో పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)కూడా ఉన్నారు. బలమైన బీసీ కార్డు ఉండడంతో కేబినెట్ లో తేలిగ్గానే మంత్రి పదవి దొరికింది. అత్యంత అవినీతిమయమైన రవాణా శాఖ, బీసీ సంక్షేమం తో పాటు…. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా కూడా ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)కి బాధ్యతలు అప్పగించారు. పొన్నం ప్రభాకర్ కి మొదటి నుంచి ఉన్న కొంత నోటి దురుసుతనం, పార్టీలో మిగిలిన నేతలతో బలమైన సంబంధాలు లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఆయన వచ్చిన తర్వాత రవాణా శాఖలో భారీగా అవినీతి పెరిగిపోయిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
పొన్నంకు సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలు ఈ దందా చూసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెహికల్ ఇన్స్పెక్టర్సు, ఇతర అధికారుల బదిలీలకు భారీగా వసూలు చేశారని ఆరోపణలున్నాయి. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డితో గ్యాప్ పెరిగినట్టు కూడా తెలుస్తోంది. అందుకే పలుసార్లు రేవంత్ పైనా విమర్శలు చేసారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టైమ్ లోనూ భారీగా వసూళ్ళకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో పొన్నం ప్రభాకర్ ను మంత్రి వర్గం నుంచి సాగనంపాలని డిసైడయినట్టు తెలుస్తోంది.




One Comment