Pooja Room:దేవుడి గదిలో ఈ చిన్న మార్పులు చేస్తే నెగెటివ్ ఎనర్జీ మాయం
Pooja Room: మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు (East) లేదా ఉత్తరం వైపు (North) ఉండేలా చూసుకోవాలి.
Pooja Room
ప్రస్తుత కాలంలో ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంత ముఖ్యమో, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదని, ఇంట్లో ఎప్పుడూ ఏదో తెలియని అశాంతిగా ఉంటుందని బాధపడుతుంటారు. దీనికి కారణం మీ పూజ గదిలో ఉండే చిన్న చిన్న వాస్తు దోషాలు కావచ్చు.
దేవుడి ఫోటోలు ఎటు వైపు ఉండాలి?..వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడి గది(Pooja Room) ఎప్పుడూ ఈశాన్య మూల (North-East) ఉండటం మంచిది. మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు (East) లేదా ఉత్తరం వైపు (North) ఉండేలా చూసుకోవాలి. అంటే దేవుడి ఫోటోలు పశ్చిమ గోడకు లేదా దక్షిణ గోడకు ఆనుకుని ఉండాలి. ఇలా ఉండటం వల్ల ప్రకృతి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ నేరుగా మీపై ,ఇంట్లోని వ్యక్తులపై ప్రసరిస్తుంది.
చాలా మంది దేవుడి గదిలో విగ్రహాలను ఒకదానికొకటి ఎదురుగా పెడుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. విగ్రహాల మధ్య కనీసం ఒక అంగుళం గ్యాప్ ఉండాలి. అలాగే గదిలో వెలుతురు తక్కువగా ఉండకూడదు. చీకటిగా ఉండే పూజ గది(Pooja Room) నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కనీసం ఒక చిన్న కిటికీ లేదా ఎప్పుడూ వెలిగే ఒక చిన్న బల్బునైనా ఏర్పాటు చేయండి.

పగిలిన విగ్రహాలు, రంగు వెలిసిపోయిన ఫోటోలను వెంటనే తొలగించి పారే నీటిలో కలపాలి. అవి ఇంట్లో ఉంటే మానసిక ఆందోళనలు పెరుగుతాయి. అలాగే దేవుడి గది(Pooja Room)లో చనిపోయిన పూర్వీకుల ఫోటోలను పెట్టకూడదు. వారి ఫోటోలను దక్షిణ దిశలో వేరే గదిలో పెట్టుకోవడం మంచిది.
పూజ గదిలో ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ల ఉప్పు (Sea Salt) వేసి మూలన ఉంచండి. ఈ ఉప్పు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. ప్రతి వారం ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి.



