Just SportsLatest News

T20 World Cup:టి20 వరల్డ్ కప్ ముందే మైండ్ గేమ్స్..భారత్‌ను రెచ్చగొట్టిన షాహీన్ అఫ్రిది

T20 World Cup: గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాక్ బౌలర్లను ఎలా ఊచకోత కోశారో గుర్తుచేస్తూ నెటిజన్లు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.

T20 World Cup

భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మైదానంలో యుద్ధంలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. 2026 టి20 ప్రపంచ కప్  (T20 Worlsd Cup) సమీపిస్తున్న సమయంలో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.

టీమిండియా టాప్ ఆర్డర్‌ను పడగొట్టడం తనకు పెద్ద విషయం కాదని, ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌ను ఘోరంగా ఓడిస్తామని అఫ్రిది కవ్వింపు చర్యలకు దిగాడు. గత మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లను తాను ఎలా ఇబ్బంది పెట్టానో గుర్తుచేస్తూ ఈ కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది

అయితే, భారత అభిమానులు మాత్రం దీనిపై సీరియస్‌గా రియాక్టవుతున్నారు. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాక్ బౌలర్లను ఎలా ఊచకోత కోశారో గుర్తుచేస్తూ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. మైదానంలో నోటితో కాకుండా ఆటతో సమాధానం చెబుతామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

T20 World Cup
T20 World Cup

నిజానికి షాహీన్ అఫ్రిది ఒక అద్భుతమైన బౌలర్ అయినా కూడా, భారత్‌పై గెలవడం అంత ఈజీ కాదన్న విషయం అతనికీ కూడా తెలుసని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉండటంతో ఈ పోరు రసవత్తరంగా మారబోతోంది.

ఇక టి20 వరల్డ్ కప్ లో భారత్ – పాక్ సమరానికి రెండు దేశాల్లో కూడా ఎప్పుడూ భారీ క్రేజ్ ఉంటుంది.తాజాగా అఫ్రిది ప్రయోగించిన మైండ్ గేమ్ వల్ల ఆ మ్యాచ్ పై ఉత్కంఠ మరింత పెరిగింది. అఫ్రిది వ్యాఖ్యలు భారత ఆటగాళ్లలో కసిని పెంచుతాయనడంలో డౌటే లేదు. మరి రాబోయే టోర్నీలో మైదానంలో ఎవరు విజేతగా నిలుస్తారో కాలమే నిర్ణయించాలి.

WPL : అమ్మాయిల ధనాధన్.. ఇక డబ్ల్యూపీఎల్ హంగామా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button