WPL : అమ్మాయిల ధనాధన్.. ఇక డబ్ల్యూపీఎల్ హంగామా
WPL : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమ్మాయిల డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ శుక్రవారం నుంచే మొదలుకానుంది
WPL
అమ్మాయిల క్రికెట్ కు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ రుజువు చేసింది. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్ తలపడినప్పుడు అభిమానులు ఉత్సాహంగా మ్యాచ్ లు తిలకించారు. అటు స్టేడియాల్లోనూ, ఇటు టీవీల్లోనూ వ్యూయర్ షిప్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నిజానికి వుమెన్స్ క్రికెట్ క్రేజ్ పెరగడంలో మహిళల ఐపీఎల్ పాత్ర కూడా చాలానే ఉంది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే బీసీసీఐ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభించినప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.
దీనికి కారణం 2023 సమయానికి అమ్మాయిల క్రికెట్ కు ఆదరణ ఓ మోస్తారుగా ఉండడమే. అయితే డబ్ల్యూపీఎల్ (WPL) తొలి సీజన్ అంచనాలను అందుకుంది. టాప్ క్లాస్ క్రికెటర్లు, ఉత్కంఠభరిత మ్యాచ్ లతో పాటు అభిమానులతో స్టేడియాలు కళకళలాడడం జోష్ పెంచాయి. అటు వ్యూయర్ షిప్ లో కూడా అనుకున్నదాని కంటే ఎక్కువగానే గణాంకాలు నమోదయ్యాయి. దీంతో బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లు , స్పాన్సర్లు ఫుల్ హ్యాపీ.. ఆ తర్వాత 2024, 2025 సీజన్లలోనూ వుమెన్స్ ఐపీఎల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పురుషుల ఐపీఎల్ కు ధీటుగా అభిమానుల ఆదరణ రావడంతో క్రేజ్ మరింత పెరిగింది.
ఇప్పుడు కొత్త సీజన్ కూడా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబ్ల్యూపీఎల్ (WPL) 2026 సీజన్ శుక్రవారం నుంచే మొదలుకానుంది. ఫిబ్రవరి 5 వరకూ మొత్తం 22 టీ20లు అభిమానులను అలరించబోతున్నాయి. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ విజయంతో మన అమ్మాయిల మీద అంచనాలు రెట్టింపయ్యాయి.

స్మృతి మంధాన, దీప్తి శర్మ , షెఫాలీ వర్మ, హ్యార్లిన్ డియోల్, క్రాంతి గౌడ్, శ్రీచరణి వంటి ప్లేయర్స్ ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు 2023, 2025లలో ఛాంపియన్ గా నిలిస్తే.. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకుంది. కాగా
ఈ సారి లీగ్ మొత్తం రెండు నగరాల్లోనే నిర్వహిస్తున్నారు. మొదటి 11 మ్యాచ్ లకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం , మిగిలిన లీగ్ మ్యాచ్ లు, ఎలిమినేటర్, ఫైనల్ వడోదరలో జరగనున్నాయి. 2026 డబ్ల్యూపీఎల్ సీజన్ లో ఐదు జట్లు తలపడనుండగా.. వేలం తర్వాత పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని టీమ్స్ కు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతుండా..ఈ నాట్ సివర్-బ్రంట్, అమెలియా కెర్ వంటి బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే 2024 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్మృతి మంధాన సారథ్యం వహిస్తోంది. మరోసారి టైటిల్ గెలవాలనుకుంటున్న ఆర్సీబీకి ఎల్లిస్ పెర్రీ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మెగా లానింగ్ కు వదులుకుని జెమీమా రోడ్రిగ్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అలాగే అనాబెల్ సదర్లాండ్ ప్లేస్ లో స్పిన్నర్ అలనా కింగ్‌ను తీసుకున్నారు.
ఇక యూపీ వారియర్స్ కూడా తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా మెగ్ లానింగ్ ను ఎంపిక చేసింది. దీంతో దీప్తి శర్మ ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతుంది. అటు గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ కెప్టెన్సీలో బరిలోకి దిగుతుండగా.. సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఆ జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
Budget :చరిత్రలో రెండోసారి ఆదివారం రోజే బడ్జెట్ ప్రవేశం..మరి ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు? ఏంటా స్పెషల్?




One Comment