Just SportsLatest News

PCB : తోక ముడిచిన పాకిస్థాన్..బాయ్ కాట్ నిర్ణయంపై యూటర్న్

PCB : క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ యథాప్రకారమే జరగనుంది

PCB

క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ యథాప్రకారమే జరగనుంది. భారత్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గత మూడు రోజులుగా మొండిగా వ్యవహరించిన పీసీబీ(PCB) ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఐసీసీ అధికారులతో చర్చలు, శ్రీలంక క్రికెట్ బోర్డు జోక్యంతో మెత్తబడిన పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆడేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం దీనిపై తమ దేశ ప్రభుత్వంతో చర్చించనున్న పీసీబీ(PCB) సోమవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదంలో ఆదివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాక్ బోర్డుతో చర్చించేందుకు ఐసీసీ(ICC) అధికారులు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం లాహోర్ వెళ్లారు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో పాక్ బోర్డు పలు డిమాండ్లను కూడా ఐసీసీ ముందుంచినట్టు తెలుస్తోంది.

తమకు వచ్చే రెవెన్యూ వాటాను పెంచడం, భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ ల పునరుద్ధరణ విషయంలో ఒత్తిడి తీసుకురావడం వీటిలో ప్రధానంగా ఉన్నాయి. కానీ ఐసీసీ మాత్రం రెవెన్యూ వాటా విషయంలో ఇతర బోర్డులతో చర్చించాకే చెబుతామని తెలిపింది. అదే సమయంలో భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ ల విషయంలో తామేమీ చేయలేమని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో ముడిపడి ఉన్న అంశంగా పేర్కొంది.

PCB
PCB

ఈ సమావేశంలో ఐసీసీ అధికారులు భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తే జరగబోయే పరిణామాల గురించి మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెవెన్యూ వాటా సంగతి అటుంచితే బ్రాడ్ కాస్టర్లకు, స్పాన్సర్లకు ఎవరు సమాధానం చెబుతారని ఐసీసీ తీవ్రంగా స్పందించడం, ఇక్కడ నుంచీ పాక్ బోర్డు వెనక్కి తగ్గి తమ ప్రభుత్వంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. కాగా బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలకు నిరసనగా ఐపీఎల్(IPL) నుంచ ముస్తాఫిజుర్ రహమాన్ ను తప్పించడంతో వివాదం మొదలైంది.

దీనికి ప్రతీకార చర్యగా బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్ కు చోటు దక్కింది. అదే సమయంలో బంగ్లాకు మద్ధతుగా పాక్ భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ఐసీసీతో పాటు బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించాయి. భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి రానుండడంతో ఎట్టకేలకు పాక్ బోర్డు తోక ముడిచినట్టు స్పష్టమైంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button