Ravindra jadeja : జడేజా సరికొత్త రికార్డ్.. ఇంగ్లాండ్ గడ్డపై మెరిసిన భారత దిగ్గజాలెవరు?
Ravindra jadeja : టీమిండియా ఆల్‌రౌండ్ స్టార్ రవీంద్ర జడేజా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

Ravindra jadeja : టీమిండియా ఆల్‌రౌండ్ స్టార్ రవీంద్ర జడేజా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు చేయగానే, జడేజా ఒక అసాధారణ మైలురాయిని అధిగమించాడు. ఇంగ్లాండ్ గడ్డ(England Tour)పై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, ఒక అరుదైన ఆల్‌రౌండ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
Ravindra jadeja
ఇంగ్లాండ్ గడ్డపై 1000కి పైగా టెస్టు పరుగులు సాధించడంతో పాటు 30కి పైగా వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఎంత అరుదైనదంటే, టెస్టు క్రికెట్ చరిత్రలో, ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్(Gary Sobers) 1957-1974 మధ్య కాలంలో ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడగా.. ఇప్పుడు జడేజా ఆ ఎలైట్ క్లబ్‌లో చేరాడు.
మరింత విశేషం ఏమిటంటే, ఓవరాల్‌గా తీసుకుంటే, విదేశీ గడ్డపై (ఇంగ్లాండ్‌తో సహా) 1000కి పైగా పరుగులు, 30కి పైగా వికెట్లు సాధించిన ఆటగాళ్లలో జడేజా కేవలం మూడోవాడు మాత్రమే. ఈ జాబితాలో సర్ గ్యారీ సోబర్స్, ఇంగ్లాండ్ దిగ్గజం విల్ఫ్రెడ్ రోడ్స్ (ఆస్ట్రేలియా గడ్డపై) మాత్రమే ఉన్నారు. ఇది జడేజా ఆల్‌రౌండ్ ప్రావీణ్యానికి, స్థిరమైన ప్రదర్శనకూ తిరుగులేని నిదర్శనం.
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో భారత తరఫున అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆల్‌రౌండర్లుగా పేరుగాంచిన కపిల్ దేవ్, వినూ మన్కడ్ వంటి వారికంటే ముందు నిలవడం జడేజాకు గర్వకారణం.
రవీంద్ర జడేజా: (2014 నుంచి ప్రస్తుత సిరీస్ 2025 వరకు)
16 మ్యాచ్‌లలో 1096 పరుగులు (ఈ సిరీస్‌లోనే 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో అద్భుత ప్రదర్శన)
34 వికెట్లు (వివిధ సిరీస్‌లలో కీలక బ్రేక్‌త్రూలు అందించారు)
కపిల్ దేవ్: (1979 నుంచి 1990 వరకు)
13 మ్యాచ్‌లలో 638 పరుగులు ..ముఖ్యంగా 1982, 1986, 1990 పర్యటనలలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు
43 వికెట్లు (1979లో 5/125, 1982లో 5/125 వంటి ప్రదర్శనలతో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు)
వినూ మన్కడ్: (1946 నుంచి 1952 వరకు)
6 మ్యాచ్‌లలో 395 పరుగులతో 1952 లార్డ్స్ టెస్టులో 72, 184 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు
20 వికెట్లు తీసారు. 1946లో 5/101, 1952లో 5/196 వంటి అద్భుతమైన స్పెల్స్ వేశారు.
రవిశాస్త్రి: (1982 నుంచి 1990 వరకు)
9 మ్యాచ్‌లలో 503 పరుగులు చేశారు. 1990లో ఓవల్ టెస్టులో 187 పరుగులు చేసి తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు.
11 వికెట్లు (పార్ట్-టైమ్ స్పిన్నర్‌గా అవసరమైన వికెట్లు తీశారు, ముఖ్యంగా 1986, 1990 సిరీస్‌లలో)
ఈ స్కోర్ జడేజా బ్యాటింగ్‌లో చూపిన స్టెబులిటీని, కీలక వికెట్లు తీయడంలో అతని కెపాసిటీని ప్రపంచానికి తెలియజేశాయి. .
మ్యాచ్ విషయానికి వస్తే, మాంచెస్టర్‌లో జరిగిన ఈ నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి, తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారీగా 669 పరుగులు సాధించి, బలమైన ఆధిక్యాన్ని సంపాదించారు. అయితే, భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకొని, 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఈ మ్యాచ్ ఫలితం డ్రాగా ముగిసినా కూడా.. రవీంద్ర జడేజా సాధించిన ఈ అరుదైన ఆల్‌రౌండ్ ఘనత క్రికెట్ ఫ్యాన్స్ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.