Allu Ayan: అల్లు అయాన్‌పై సైబర్ ట్రోలింగ్..పసి మనసుపై నెగెటివ్ ఇంపాక్ట్
Allu Ayan: గతంలో అయాన్ పబ్లిక్ ఈవెంట్స్‌లో చేసిన కొన్ని అల్లరి పనులను, తెలిసీ తెలియక చేసిన పనులను కూడా ట్రోల్ చేసిన వీడియోలు బాగానే ఉన్నాయి.

Allu Ayan
అల్లు కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. ఈ సమయంలో కూడా, సైలెంట్‌గా కొంతమంది అల్లు అయాన్(Allu Ayan)పై ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఒక పసివాడు తెలియక చేసిన పనులను కూడా భూతద్దంలో పెట్టి, వ్యక్తిగత ద్వేషాన్ని బయటపెడుతున్నారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో అయాన్(Allu Ayan)ను హైలెట్ చేస్తూ కనిపిస్తున్న ట్రోల్ వీడియోలే దీనికి సాక్ష్యం. నిజానికి ఇది కేవలం ఒక సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, మన సమాజం నైతికంగా ఎంత దిగజారిపోయిందో చెప్పే ఒక సీరియస్ ఇష్యూ.
కొంతమంది తమ వ్యక్తిగత ద్వేషం, రాజకీయ వైషమ్యాలతో పసిపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. అయాన్ (Allu Ayan) తన బామ్మ మృతదేహం వద్ద ఉన్నప్పుడు చేసిన పనులను పని గట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. ఒక చిన్న పిల్లాడికి చావు, దుఃఖం, మత సంప్రదాయాల గురించి పూర్తి అవగాహన ఉండదు. అలాంటి సమయంలో వారి అమాయకమైన ప్రవర్తనను ఇలా ట్రోల్ చేయడం నిజంగా దారుణం. అలా అయాన్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు .గతంలో అయాన్ పబ్లిక్ ఈవెంట్స్‌లో చేసిన కొన్ని అల్లరి పనులను, తెలిసీ తెలియక చేసిన పనులను కూడా ట్రోల్ చేసిన వీడియోలు బాగానే ఉన్నాయి.
అయితే ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా, సోషల్ మీడియాలో తమపై వచ్చే ట్రోలింగ్‌ను చూసినప్పుడు పిల్లలు తీవ్రమైన మెంటల్ ట్రామా, ఆత్మన్యూనతా భావానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, స్నేహితులతో, సమాజంలో ఎలా ఉండాలో తెలియని కన్‌ఫ్యూజన్‌కు దారి తీస్తుంది. పిల్లల భవిష్యత్తుపై ఇది నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని అంటున్నారు.

Gold: సామాన్యుడికి కలగా మిగులుతున్న పసిడి..ఈరోజు ధర ఎంత?
సైబర్ పోలీసులు, న్యాయస్థానం ఇలాంటి మానసిక హింసను చూస్తూ మౌనంగా ఉండకూడదు. ఇప్పటికే చాలా దేశాలలో మైనర్లపై ట్రోలింగ్ పెంచకుండా నియంత్రణలు ఉన్నాయి. సెలబ్రిటీలు తమ పిల్లలను ఎంత ప్రొటెక్ట్ చేయాలనుకున్నా, ఇలాంటి సైకో ట్రోలింగ్ నుంచి వారిని కాపాడటం కష్టం.అందుకే ఇక్కడ కఠిన నియమాలు అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
అల్లు అర్జున్ వంటి పేరెంట్స్ తమ పిల్లల ప్రశాంతత కోసం ఈ విషయాలపై మౌనంగా ఉన్నా కూడా.. సోషల్ మీడియాలో ఉన్న సైకోలను ఇలాగే వదిలేస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది కేవలం సెలబ్రిటీల పిల్లలకు మాత్రమే పరిమితం కాదు, భవిష్యత్తులో ఏ పిల్లాడైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అందుకే, మనం ప్రతి ఒక్కరూ ఈ ట్రోలింగ్‌ను ఖండించాలి. పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి..