Bigg Boss: బిగ్ బాస్ అసలైన అగ్ని పరీక్ష మొదలయిందా?
Bigg Boss: అంచనా వేసే టాస్క్‌లతో మొదలైన బిగ్ బాస్ ఆటలో, ఎవరి సత్తా ఎంతో క్లారిటీ వచ్చింది. కానీ, ఆట చివరికి వచ్చేసరికి అసలు మసాలా బయటపడింది.

Bigg Boss
సోమవారం నాటి బిగ్ బాస్ (Bigg Boss)ఎపిసోడ్ కేవలం టాస్కులతో నిండిన ఒక రోజు కాదు, అది కంటెస్టెంట్లలో దాగి ఉన్న అసలు స్వభావాన్ని, వారి మధ్య ఉన్న అంతర్గత పోరును బయటపెట్టిన ఒక అగ్ని పరీక్ష. అంచనా వేసే టాస్క్‌లతో మొదలైన ఈ ఆటలో, ఎవరి సత్తా ఎంతో క్లారిటీ వచ్చింది. కానీ, ఆట చివరికి వచ్చేసరికి అసలు మసాలా బయటపడింది.
మొదట, బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్లకు నాలుగు విభిన్నమైన టాస్కులు ఇచ్చి, గెలిచిన వారిని లీడర్లుగా ప్రకటించారు. మరమరాల టాస్కులో శ్రీజ, చెరుకు గడ టాస్కులో షాకిబ్, స్ట్రాల టాస్కులో హరీష్, ఆలుగడ్డ టాస్కులో శ్వేత విజేతలుగా నిలిచారు. కానీ, అసలు నాటకీయత చివరిలో జరిగింది.
చివరికి ఏ టీంలో చేరకుండా మనీష్, శ్రేయా, దాల్య మిగిలారు. ఈ ముగ్గురిలో ఒకరిని లీడర్‌గా ఎంచుకోవాలని బిగ్ బాస్ (Bigg Boss) మిగిలిన కంటెస్టెంట్లను అడిగాడు. అయితే, ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రేయాకు అందరూ మద్దతుగా చేయి ఎత్తారు. కానీ, మనీష్‌కి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా చేయి ఎత్తలేదు!
అతనిపై ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో ఈ సంఘటనతో స్పష్టమైంది. ఆటలో ఓవర్ స్మార్ట్‌గా వ్యవహరించడం, ఒక్క టాస్కు కూడా గెలవలేకపోవడం, టీం పదే పదే ఓడిపోవడం.. ఇవన్నీ అతని పరాజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. దాల్యకి కూడా ఒక్క ఓటు మాత్రమే పడింది, అది కూడా కళ్యాణ్ పడాల నుంచి. చివరికి, ఓటింగ్ ఆధారంగా శ్రేయా లీడర్ అయింది.
Gold: సామాన్యుడికి కలగా మిగులుతున్న పసిడి..ఈరోజు ధర ఎంత?

ఐదు టీంలకు నాలుగు లెవెల్స్‌లో బెలూన్ టాస్క్ పెట్టారు. ఒక్కో రౌండ్‌లో చివరిగా మిగిలిన వ్యక్తి రాడ్ తీయడం, బ్లాక్ బెలూన్ పడితే ఆ టీం అవుట్ అవ్వడం ఆట నియమం. ఈ టాస్కులో శ్వేత టీం మొదటి రౌండ్‌లోనే, కల్కి టీం రెండో రౌండ్‌లో, శ్రీజ టీం మూడో రౌండ్‌లో ఓడిపోయాయి. చివరికి, శ్వేత తీసిన రాడ్ వల్ల షాకిబ్ టీం ఓడిపోయింది.
దీంతో ఎవరి అంచనాలకు అందకుండా శ్రేయా టీం గెలిచింది. శ్రేయా గెలవడమే కాకుండా, ఎల్లో కార్డులు ఉన్న దాల్య, మనీష్‌లను కూడా గెలిపించినట్టు అయింది. శ్రేయా గెలుపుతో జడ్జ్‌లు శ్రీముఖి, శివబాలాజీ కూడా ఆనందంతో స్టెప్పులేశారు. గెలిచిన తర్వాత “ఇన్ని రోజులు నేను ఆడటం లేదు అన్నారు కదా.. ఈ గెలుపు నాకోసమే” అంటూ శ్రేయా ఎమోషనల్ అయింది.
టీం గెలిచినందుకు వచ్చిన ఓట్ అప్పీల్ ఛాన్స్‌ని శ్రేయా దాల్యకి ఇచ్చింది. అయితే, జడ్జ్‌లు మాత్రం మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా శ్రేయానే ఎంచుకుని, ఆమెకు కూడా ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ టాస్కులే కాదు, కంటెస్టెంట్ల మధ్య ఉన్న రిలేషన్స్, ఈర్ష్య, అసంతృప్తి వంటి విషయాలను బయటపెట్టింది. రాబోయే రోజుల్లో ఈ ఆటలో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి మరి!
2 Comments