FASTag:దేశమంతా ఫాస్టాగ్ యాన్యువల్ పాస్..ఒక్క తెలంగాణలో తప్ప..కారణం ఏంటి?
FASTag:ఈ స్కీమ్ దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చినా, ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.

FASTag
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాహనదారులకు ఒక కొత్త, వినూత్న పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే యాన్యువల్ టోల్‌పాస్. ఈ పథకం కింద, ఫాస్టాగ్(FASTag) ఉన్న వాహనదారులు రూ.3,000 చెల్లించి, ఏడాదిలో 200 టోల్‌గేట్లను దాటొచ్చు. ఈ పాస్ కమర్షియల్ వాహనాలకు కాకుండా, కార్లు, జీపులు, వ్యాన్ల వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) తెలిపిన వివరాల ప్రకారం, పథకం ప్రారంభించిన మొదటి రోజే సుమారు 1.4 లక్షల మంది వాహనదారులు ఈ పాస్(FASTag annual pass Telangana)ను కొనుగోలు చేశారు. అయితే, ఈ స్కీమ్ దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చినా, ప్రస్తుతం తెలంగాణ(FASTag annual pass Telangana)లో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనిపై వాహనదారుల్లో గందరగోళం నెలకొంది.
ఈ కొత్త పథకం తెలంగాణలో అమలు కాకపోవడానికి ప్రధాన కారణం, రాష్ట్రంలోని వాహనాల వివరాలు వాహన్ డేటాబేస్లో ఇంకా పూర్తిస్థాయిలో నమోదు కాకపోవడమే.వాహన్ డేటాబేస్ అనేది కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కేంద్రీకృత వ్యవస్థ. దీని ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు (RTO) నుంచి వాహన రిజిస్ట్రేషన్ సమాచారాన్ని ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం.
వాహన్ డేటాబేస్‌లో వాహన యజమాని పేరు,రిజిస్ట్రేషన్ తేదీ, వాహనం రకం, ఇంధనం రకంఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు వంటి అన్ని వివరాలు ఉంటాయి.

దేశంలోని చాలా రాష్ట్రాలు తమ వాహన డేటాను ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయగా, తెలంగాణ మాత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు, రాయితీలు ఇక్కడి వాహనాలకు వర్తించడం లేదు. ఈ విషయంపై కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి, తెలంగాణ వాహనదారులకు కూడా ఈ కొత్త పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఈ డేటాబేస్ వల్ల వాహనాలకు సంబంధించిన పన్నులు, ఫీజులు, పెండింగ్ చలాన్లు వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఇద్దరికీ పారదర్శకత పెరుగుతుంది. ఫాస్టాగ్ (FASTag)వంటి కొత్త పథకాలకు కూడా ఈ డేటాబేస్ కీలకంగా మారింది. తెలంగాణలో కూడా ఈ సమస్య పరిష్కారమైతే, తరచుగా టోల్‌గేట్లు దాటే వాహనదారులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది