Women:నలభైలలో ఛాలెంజింగ్ లైఫ్.. ఎలా ఫేస్ చేయాలి?
Women: ఈ మార్పులను అర్థం చేసుకుని, వాటికి తగ్గట్టుగా లైఫ్‌స్టైల్‌ను మార్చుకుంటే, ఈ కొత్త లైఫ్‌ను మరింత హెల్తీగా, యాక్టివ్‌గా లీడ్ చేయొచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Women
ఒక స్త్రీ (Women) లైఫ్‌లో 40ల వయసు ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. ఈ స్టేజ్‌లో ఆమె లైఫ్ కొత్త రూట్‌లో వెళ్లడానికి రెడీ అవుతుంది. ఈ చేంజ్ కేవలం ఏజ్ వల్ల కాదు..ఇంటర్నల్‌గా బాడీలో జరిగే అసాధారణ పరిణామం. ఈ వయసులో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ లాంటి ముఖ్యమైన హార్మోన్ల లెవెల్స్‌లో పెద్ద మార్పులు స్టార్ట్ అవుతాయి. ఈ మార్పులు కనిపించవు కానీ, వాటి ఎఫెక్ట్ మొత్తం బాడీపై వైడ్‌గా ఉంటుంది. ఈ మార్పులను అర్థం చేసుకుని, వాటికి తగ్గట్టుగా లైఫ్‌స్టైల్‌ను మార్చుకుంటే, ఈ కొత్త లైఫ్‌ను మరింత హెల్తీగా, యాక్టివ్‌గా లీడ్ చేయొచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఈ హార్మోన్ల ఎఫెక్ట్ ముందుగా రీప్రొడక్టివ్ సిస్టమ్‌పై ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో పీరియడ్స్ ఆగిపోవడం (మెనోపాజ్) స్టార్ట్ అవుతుంది. ఈ టైమ్‌లో రీప్రొడక్టివ్ కెపాసిటీ గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. అయితే ఈ మార్పులు కేవలం రీప్రొడక్టివ్ సిస్టమ్‌కే లిమిట్ కావు. ఈ హార్మోన్ల లెవెల్స్ తగ్గడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు.
నిద్రలేమి, అలసటతో కూడిన రోజులు, మూడ్ స్వింగ్స్, తల నొప్పులు , శరీరంలో నొప్పులు సాధారణంగా కనిపిస్తాయి. జుట్టు రాలడం కూడా మొదలవ్వచ్చు. ఆసక్తికరంగా, తినకుండానే బరువు పెరగడం కూడా హార్మోన్ల కారణంగా జరిగే సమస్య. స్కిన్ టోన్ కు కూడా మార్పులు వస్తాయి, అవి సాధారణంగా పొడిబారి కడుపు, ముఖంపై తీవ్రత కలిగించవచ్చు.
ఒక ముఖ్యమైన ప్రాబ్లమ్ ఆస్టియోపోరోసిస్. అంటే బోన్స్ వీక్‌గా మారడం. ఈ హార్మోన్ల లెవెల్స్ తగ్గడంతో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, అంతేకాకుండా గాయాలు త్వరగా వచ్చే, అవి సరిగ్గా కోలుకోకపోవడం జరుగుతుంది. అందుకే ఈ దశలో కాల్షియం, విటమిన్ D ఉండే ఫుడ్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అవుతుంది.
ఈ ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేయడానికి ఎక్స్‌పర్ట్స్ చెప్పేది ఒకటే మాట – లైఫ్‌స్టైల్‌లో చేంజెస్ తీసుకురావడం. మంచి, బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. బాడీకి కావాల్సిన న్యూట్రియెంట్స్‌ను అందించడానికి ఆకుపచ్చ కూరగాయలు, ఫ్రూట్స్, నాన్-వెజ్‌తో పాటు పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలు అందించవచ్చు. ఫైబర్ గురించి కూడా గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు పల్సెస్ హెల్ప్ చేస్తాయి.

అలాగే ప్రతి రోజు ప్రాణాయామం, యోగా లేదా లైట్ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలి. ప్రకృతికి అనుగుణంగా మరింత యాక్టివ్‌గా ఉండటం, బోన్స్ స్ట్రెంత్‌ను పెంచే ఎక్సర్‌సైజ్‌లు చేయడం చాలా అవసరం. స్లీప్ చాలా కీలకం. మీకు తగినంత నిద్ర రాకపోతే, మూడ్ స్వింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయాలి. మనసుకు పీస్ తీసుకొచ్చే మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ లాంటివి పాటించడం బెటర్.
ఈ చేంజెస్ జీవితం మొత్తం ఉండవని, హెల్తీగా ఈ ఫేజ్‌ను దాటొచ్చని ఎక్స్‌పర్ట్స్ గట్టిగా చెబుతున్నారు. సరైన న్యూట్రియెంట్స్, ఫిజికల్ యాక్టివిటీతో పాటు మెంటల్ హెల్త్‌పై పెట్టే శ్రద్ధతోనే 40లు దాటిన తర్వాత స్త్రీలు(Women) ఫిట్‌గా, హెల్తీగా లైఫ్‌ను కొనసాగించవచ్చు. ఈ స్టేజ్ కొత్త లైఫ్‌కు ఒక టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు. అందుకే ఈ హార్మోనల్ మార్పులను పాజిటివ్‌గా స్వీకరించి, హెల్త్ దిశగా ముందుకు వెళ్లడం స్త్రీలకు ఎంతో ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.
Also Read: Kangana Ranaut: ఆ మహిళ గర్భానికి బాధ్యులు ఎవరు? .. కంగనా రనౌత్