Self-cleaning:యవ్వనంగా ఉండాలా? ఈ సెల్ఫ్-క్లీనింగ్ మెకానిజం తెలుసుకోండి
Self-cleaning:ఈ అద్భుతమైన సెల్యులార్ మెకానిజం ప్రాముఖ్యతను కనుగొన్నందుకు జపనీస్ శాస్త్రవేత్త యోషినోరి ఒసుమికి 2016లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

Self-cleaning
ఆటోఫాగీ (Autophagy) అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. దీని అర్థం “స్వీయ-భక్షణం”. ఇది మన శరీరంలోని కణాలు తమలో ఉన్న దెబ్బతిన్న భాగాలు, వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసుకుని, కొత్త, ఆరోగ్యకరమైన కణాలను నిర్మించుకునే ఒక సహజ ప్రక్రియ. ఈ అద్భుతమైన సెల్యులార్ మెకానిజం ప్రాముఖ్యతను కనుగొన్నందుకు జపనీస్ శాస్త్రవేత్త యోషినోరి ఒసుమికి 2016లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
ఆటోఫాగీ ఒక రకమైన సెల్యులార్ రీసైక్లింగ్ సిస్టమ్(self-cleaning). ఇది సరిగ్గా పనిచేయకపోతే, కణాలలో వ్యర్థాలు పేరుకుపోయి, క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి అనేక వ్యాధులకు దారితీస్తాయి. అందుకే ఆటోఫాగీని ఉత్తేజపరచడం వల్ల మన శరీరం వ్యాధుల నుంచి రక్షణ పొందుతుంది.
ఆటోఫాగీని ఎలా ఉత్తేజపరచాలి?

ఉపవాసం (Fasting): మనం ఆహారం తీసుకోనప్పుడు, శరీరం శక్తి కోసం పాత, దెబ్బతిన్న కణాలను ఉపయోగించుకోవడం మొదలుపెడుతుంది. ఇది ఆటోఫాగీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ వంటి పద్ధతులు ఆటోఫాగీని ప్రేరేపించడంలో సహాయపడతాయి.మన పెద్దవాళ్లు ఉపవాసం పేరుతో మూఢనమ్మకాన్ని పెంచుతున్నారని అనుకుంటారు కానీ ఆటోఫాగీని ఉత్తేజపరచడానికే ఇది అని చాలామందికి తెలియదు.
వ్యాయామం.. అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు (High-intensity exercise) కూడా ఆటోఫాగీని ప్రేరేపిస్తాయి.
కార్బోహైడ్రేట్లు తగ్గించడం.. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కొవ్వులు ఉండే కెటోజెనిక్ డైట్ కూడా ఆటోఫాగీని ప్రేరేపించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆటోఫాగీ ఒక అద్భుతమైన సెల్యులార్ రిపేర్(self-cleaning) ప్రక్రియ. దీనిని ప్రేరేపించడం వల్ల మన శరీరం మరింత యవ్వనంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉంటుంది.