Partner : మీ భాగస్వామికి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారా? అయితే మీ విలువ మీరే తగ్గించుకున్నట్లే..
Partner : బయటి వ్యక్తులు అప్పుడప్పుడు ఒకసారి కనిపిస్తారు కాబట్టి వారిని మెప్పించడానికి, వారి ముందు గొప్పగా నిలబడటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు
Partner
కొన్నిసార్లు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనుషుల పక్కన మనం ఉన్నప్పుడు కూడా.. ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. మనం ఒకరి కోసం మన ప్రపంచాన్ని, మన టైమ్‌ను పక్కన పెట్టి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంటే, మెల్లమెల్లగా వారికి మన ఉనికి చాలా సాదాసీదాగా అనిపించడం మొదలవుతుంది.
బయట ప్రపంచానికి, ఇతరులకు ఇచ్చే గౌరవంలో సగం కూడా మనకు ఇవ్వకపోగా, దానిని ప్రశ్నిస్తే తనను అర్థం చేసుకోవడం లేదంటూ తిప్పి మనల్నే తప్పుబడుతూ ఉంటారు. నిజానికి సైకాలజీ ప్రకారం మనుషులు చాలా ఈజీగా లభించే దేనికైనా చాలా త్వరగా అలవాటు పడిపోతారు. దీనినే సైకాలజీలో హెడోనిక్ అడాప్టేషన్ అంటారు.
అంటే, ఒక వస్తువు లేదా ఒక మనిషి.. తాను ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు మన పక్కనే ఉంటారనే ఫీలింగ్ ఎదుటివారికి వచ్చేసినప్పుడు, మైండ్ తెలియకుండానే వారిని చాలా తేలికగా అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది.
బయటి వ్యక్తులు అప్పుడప్పుడు ఒకసారి కనిపిస్తారు కాబట్టి వారిని మెప్పించడానికి, వారి ముందు గొప్పగా నిలబడటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇంట్లో పార్టనర్(Partner) ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది కదా అనే ఫీలింగ్‌తో వారి ఇష్టాయిష్టాలను, బాధలను ఈజీగా పక్కన పెట్టేస్తారు. వారికి అది నచ్చదు అని తెలిసినా అదే పని చేస్తూ ఉంటారు.
ఇలా బంధంలో భాగస్వామి(Partner) తన బాధను చెబితే.. తిరిగి తమను అర్థం చేసుకోవడం లేదని వాదించడం వెనుక డిఫెన్సివ్ మెకానిజం అనే సైకాలజీ దాగి ఉంది. తాము చేస్తుంది తప్పని లోపల ఎక్కడో చిన్నగా అనిపించినా, దాన్ని ఒప్పుకుంటే తమ ఈగోకి దెబ్బ తగులుతుందని భావిస్తారు.
అంతే కాదు ఆ పని రైట్ అని తమ మనసుకు పదేపదే చెప్పుకోవడం వల్ల అసలు అది తప్పుగానే అనిపించదు. అందుకే ఆ తప్పును సమర్థించుకుంటూ, ఎదుటివారి ఆలోచనా విధానంలోనే లోపమంతా ఉందనేలా మాట్లాడి మైండ్ గేమ్ ఆడుతుంటారు. దీనివల్ల అవతలి వ్యక్తిలో నిజంగానే తప్పు చేస్తున్నానా, ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనే గిల్ట్ ఫీలింగ్ , ఆత్మన్యూనత పెరిగిపోతాయి.
అయితే, ఈ సమస్యకు అసలైన పరిష్కారం సమయం , మనిషి యొక్క కొరత అంటే స్కేర్సిటీలోనే ఉంటుంది. ఆర్థిక శాస్త్రంలో లాగే సైకాలజీలో కూడా స్కేర్సిటీ ప్రిన్సిపల్ అనేది ఒకటుంది. ఏదైనా ఒక వస్తువు మనకు తక్కువగా దొరుకుతుందన్నప్పుడే దాని విలువ మనకు బాగా తెలుస్తుంది.
బంధాలలో కూడా అంతే.. 24 గంటలూ ఎదుటివారికి అందుబాటులో ఉంటూ, మనకంటూ ఎలాంటి పర్సనల్ స్పేస్ లేకుండా పూర్తిగా అవతలివారి కోసం లీనమైపోతే అవతలి వ్యక్తికి బోర్ కొట్టడం సహజం.
అలా కాకుండా ఈ పర్టిక్యులర్ టైమ్ మాత్రమే మనం మాట్లాడుకోవడానికి లేదా కలిసి ఉండటానికి కుదురుతుందనే ఒక హెల్దీ బౌండరీని సెట్ చేసుకోవాలి. అప్పుడే ఆ కొద్దిపాటి సమయం కోసం భాగస్వామి(Partner) ఎదురుచూడటం మొదలుపెడతారు. అప్పుడే మనిషి విలువ, వారు ఇచ్చే సమయం విలువ అవతలి వ్యక్తికి పూర్తిగా అర్థమవుతాయి.

బంధాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో మన సెల్ఫ్ రెస్పెక్ట్ను, మనకంటూ ఉండే సొంత జీవితాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. అతిగా అందుబాటులో ఉండటమనేది ప్రేమకు సంకేతమే కావచ్చు. కానీ అదే ప్రేమ ఎదుటివారికి చులకనగా మారినప్పుడు కాస్త దూరం జరిగి మన విలువను గుర్తుచేయడం తప్పేమీ కాదు.
భాగస్వామ్య బంధానికి గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. మనకంటూ బౌండరీస్ గీసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్న విషయం ఫాలో అవ్వాలి. అప్పుడే బంధంలో బ్యాలెన్స్ ఏర్పడి, ఇద్దరి మధ్యా పరస్పర గౌరవం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Sunscreen : ఎస్పీఎఫ్ 30, ఎస్పీఎఫ్ 50 ఏది బెటర్? మీ స్కిన్‌కి ఏ సన్‌స్క్రీన్ సెట్ అవుతుంది?





