Gossips : మీరూ మూడో వ్యక్తి మాటలే నమ్ముతారా? తప్పు మానిప్యులేటర్లదా లేక అబద్దాన్ని నమ్మిన మీదా?
Gossips : ఎదుటివారు ఎలాంటివారు అనేది పూర్తిగా తెలిసినా కూడా.. మూడో వ్యక్తి చెప్పింది గుడ్డిగా నమ్మి ప్రవర్తించే వారి గురించి సైకాలజీ ఏం చెబుతోంది?
Gossips
మన చుట్టూ చాలామందినే చూస్తుంటాం. ఒక వ్యక్తితో ఏళ్లుగా ట్రావెల్ చేసి ఉంటారు. ఆ వ్యక్తి ఎలాంటివారో, వారి స్వభావం ఏంటో వాళ్లకు పూర్తిగా తెలుసు. అయితే ఎవరో మూడో పర్సన్ వచ్చి ఆ వ్యక్తి గురించి ఏవో చెడ్డ మాటలు చెబుతారు. దీంతో ముందుగా ఉన్న పరిచయాన్ని, వారి మంచితనాన్ని క్షణంలో పక్కన పెట్టి ఆ కొత్త మాటలను గుడ్డిగా నమ్మేస్తుంటారు.
అంతేకాదు, ఆ వ్యక్తితో అకస్మాత్తుగా ప్రవర్తన మార్చుకోవడం, దూరం పెట్టడం చేస్తుంటారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, అవతలి వ్యక్తి మోసకారి కావొచ్చు లేదా మానిప్యులేటర్ కావొచ్చు, కానీ మనవాళ్లకు ఆ మాత్రం ఆలోచించే ఇంద్రజాలం లేదా? వినేవాడికి కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండకూడదా? ఈ ప్రశ్నకు సైకాలజీ చాలా ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది.
నిజానికి సొసైటీలో అందరినీ మోసం చేసే మానిప్యులేటర్లు, గాసిప్స్(Gossips) చెప్పేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్ల పని వాళ్లు చేసుకునిపోతారు. కానీ సమస్యంతా అవతలి వాళ్లు చెప్పేది గుడ్డిగా నమ్మేవారి మానసిక స్థితిలోనే ఉంటుంది. సైకాలజీ ప్రకారం దీనికి మెయిన్ రీజన్ ఆలోచించడంలో బద్ధకం (Cognitive laziness). మనుషుల బ్రెయిన్ ఎప్పుడూ కష్టపడటానికి ఇష్టపడదు.
ఏదైనా ఒక విషయాన్ని మెల్లగా రీసెర్చ్ చేసి నిజానిజాలు తెలుసుకునే కంటే.. ఎవరో వచ్చి చేతిలో పెట్టిన ఇన్ఫర్మేషన్ను ఉన్నది ఉన్నట్లు నమ్మేయడం బ్రెయిన్‌కు చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకే సొంత అనుభవాన్ని పక్కన పెట్టి బయట వ్యక్తులు చెప్పిన నెగిటివ్ విషయాలను నమ్మడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామందికి తమ సొంత జడ్జిమెంట్ మీద తమకే నమ్మకం ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వీక్ మైండ్‌సెట్ కలిగి ఉంటాడో, అప్పుడు ఇతరులు చెప్పే గాసిప్స్ (Gossips) వారిపై బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి.
ఒక వ్యక్తి మనకు మంచివారిగానే తెలిసినా.. ఎవరో వచ్చి వాళ్లు నీకు చెడు చేస్తున్నారని చెబితే చాలు, వెంటనే మన బ్రెయిన్ గతంలో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా నెగిటివ్ యాంగిల్లోకి మార్చేసుకుంటుంది. దీనినే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే మనం ఏది నమ్మాలనుకుంటున్నామో, దానికి సరిపోయే ఉదాహరణలను మన బ్రెయిన్ వెతికి మరీ పట్టుకుంటుంది.
అంతేకాకుండా, కొందరికి లైఫ్‌లో ఎప్పుడూ ఏదో ఒక డ్రామా ఉండాలి. ప్రశాంతమైన రిలేషన్షిప్స్ కంటే, అనుమానాలు, గొడవలు ఉన్నప్పుడే వారి లైఫ్‌లో ఏదో సాధించినట్లు ఒక మానసిక తృప్తి కలుగుతుంది. అందుకే మూడో వ్యక్తి వచ్చి అవతలివారిపై ఏదైనా విషయాలు చెబితే నిజానిజాలేమీ తెలుసుకోకుండా వెంటనే రియాక్ట్ అయిపోతారు.
అవతలి వారు మానిప్యులేటర్ అయి ఉండొచ్చు. ఒక నిజానికి మరో రెండు అబద్ధాలు యాడ్ చేసి చెప్పగానే కనెక్ట్ అయ్యేలా చేయడం వాళ్లకు అలవాటే అవ్వొచ్చు. కానీ వినేవారికి విచక్షణ జ్ఞానం, ఆలోచించే శక్తి లేకపోతే తప్పు కచ్చితంగా వినేవారిదే అవుతుంది. ఎవరో ఏదో చెప్పారని వారి గురించి బాగా తెలిసీ కూడా వారినే తప్పుపట్టడం మానేసి, చుట్టూ జరిగే అన్ని విషయాలను సొంత బుర్రతో ఆలోచించే శక్తిని పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎదుటివారు ఎవరైనా , ఎలాంటివారైనా సరే.. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వారితో మనకున్న సొంత అనుభవాన్ని, మనకు వాళ్లతో ఉన్న బంధాన్ని బేరీజు వేసుకునే సెన్స్ మనకే ఉండాలి. లేదంటే జీవితాంతం ఎవరో ఒకరు ఆడించే బొమ్మలాగే మిగిలిపోవాల్సి వస్తుంది.





