Just LifestyleLatest News

Makhana Milk : బరువు తగ్గడానికి మఖానా పాలు.. వీటి బెనిఫిట్సో తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

Makhana Milk : మఖానా పాలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పెరిగి మలబద్ధకానికి చెక్ పెట్టినట్లు అవుతుంది.

Makhana Milk

మారుతున్న లైఫ్‌స్టైల్ వల్ల నిద్రలేమి, జాయింట్ పెయిన్స్, స్ట్రెస్ వంటి ఎన్నో సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే మెడిసిన్స్‌తో పనిలేకుండా, వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయకుండానే.. ఇంట్లోనే ఈజీ వేలో వీటి నుంచి రిలీఫ్ పొందడానికి పాలు, మఖానా కాంబినేషన్ అద్భుతమైన సంజీవనిలా పని చేస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

పాలు, తామరగింజలు రెండింటిలో కూడా క్యాల్షియం, విటమిన్- డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఏజ్ పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గిపోయే ప్రమాదాన్ని తామరగింజల పాలు పూర్తిగా నివారిస్తుంది.

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని మఖానా మిల్క్ తాగడం వల్ల ఆ పాలలోని నేచురల్ సెడేటివ్ గుణాలు, మిల్క్‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ కలిసి నరాలను ప్రశాంతపరిచి బ్రెయిన్‌కి గాఢమైన, సంతోషకరమైన నిద్రను అందిస్తాయి.

Makhana Milk
Makhana Milk

అలాగే మఖానాలో సోడియం తక్కువగా, పొటాషియంతో పాటు మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉండి హార్ట్ సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ మఖానా పాలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పెరిగి మలబద్ధకానికి చెక్ పెట్టినట్లు అవుతుంది. అలాగే కడుపు నిండిన ఫీలింగ్‌ను ఇచ్చి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది.

ఈ హెల్దీ డ్రింక్‌ను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో కప్పున్నర పాలను మరిగించి, అందులో కాస్త నేతిలో దోరగా వేయించిన 8 నుంచి 10 మఖానాలను కూడా వేయాలి. పాలు కాస్త చిక్కబడే వరకు అంటే ఒక కప్పు అయ్యేవరకూ మరిగించి, చిటికెడు యాలకుల పొడి కానీ పసుపు కానీ వేసుకుని తాగితే రుచితో పాటు హెల్త్ కూడా మీ సొంతమవుతుంది.

Age For Marriage : పెళ్లికి ఏజ్ ఒక్కటే సరిపోదా?..మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేసే మెచ్యూరిటీ ఉండాలా?

Related Articles

Back to top button