Just LifestyleLatest News

Sorakaya Payasam : సొరకాయతో పాయసం ఇలా ట్రై చేయండి..చిన్నా పెద్దా ఇష్టంగా తింటారు..

Sorakaya Payasam : సొరకాయతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. ఇంట్లోని పదార్థాలతోనే సులభంగా చేసుకునే ఈ పాయసం రెసిపీ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Sorakaya Payasam

ఎప్పుడూ చేసే స్వీట్స్‌కు కొద్దిగా భిన్నంగా ఈ అద్భుతమైన రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే..ఇంట్లో వారంతా పోటీ పడి మరీ తింటారు. మామూలుగా సొరకాయ పేరు చెబితేనే పిల్లలు ముఖం తిప్పుకుంటారు. కానీ, దాంతో కమ్మటి పాయసం చేసి పెట్టారంటే మాత్రం గిన్నె మొత్తం నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు. రుచితో పాటు బాడీకి అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చే ఈ రెసిపీ గురించి ఇప్పుడు చూద్దాం.

ఈ సొరకాయ పాయసం(Sorakaya Payasam) తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు .. ఒక లీటర్ చిక్కని పాలు, మూడు కప్పుల బెల్లం తురుము, అర కప్పు సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్‌లు, అరటేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పులు, 10 పిస్తా పప్పులు, చిటికెడు ఉప్పు అవసరమవుతాయి.

ముందుగా లేత సొరకాయను తీసుకుని పైతొక్క తీసి శుభ్రంగా కడగాలి. లోపల ఉండే గింజలను కూడా తీసీసి, సన్నగా తురుముకోవాలి. ఆ తురుములో ఉన్న ఎక్స్‌ట్రాగా ఉన్న నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని కాసేపు గంట పాటు నానబెట్టి, మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ, కడాయి కానీ తీసుకుని నెయ్యి వేడి చేసి, తురిమిన సొరకాయను మీడియం మంటపై 10 నిమిషాల పాటు వేయించాలి.

మరో గిన్నెలో పాలను బాగా మరిగించుకుని, వేయించిన సొరకాయ తురుములో పోయాలి. సొరకాయ తురుము పాలలో పూర్తిగా కలిసే వరకు 10 నిమిషాలు ఉడికించాలి. బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టి పాయసంలో కలపాలి. బెల్లం వేసిన తర్వాత కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. చివరగా ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దించేస్తే సరిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో నోరూరించే హెల్దీ సొరకాయ పాయసం(Sorakaya Payasam) రెడీ అయిపోతుంది.

Over-Interference : బంధాల్లో ఊపిరాడనివ్వని అతి జోక్యం.. ఓవర్ ఇంటర్‌ఫియరెన్స్‌తో ముంచుకొచ్చే ముప్పు ఇదే..

Related Articles

Back to top button