Women Financial Secrets : సేవింగ్స్ మాత్రమే చేస్తే వేస్ట్ ..ప్రతీ మహిళ తెలుసుకోవాల్సిన ఫైనాన్షియల్ సీక్రెట్స్..
Women Financial Secrets : ముందు నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే భవిష్యత్తులో ఎవరిపైనా భారం కాకుండా ప్రతీ మహిళ కూడా బతకొచ్చు.
Women Financial Secrets
ఈరోజుల్లో చాలామంది మహిళలు ఆఫీస్ వర్క్ నుంచి ఫ్యామిలీ మేనేజ్మెంట్ వరకు ప్రతీ విషయంలోనూ ఆల్రౌండర్లుగా నిలుస్తున్నారు. కానీ ఇప్పటికీ డబ్బు విషయంలో మాత్రం తండ్రిపైనో, భర్తపైనో ఆధారపడుతుంటారు. సొంతంగా మనీ సంపాదించడం ఎంత ముఖ్యమో.. ఆ డబ్బును ఎలా సేవ్ చేయాలి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంపై అవగాహన ఉండటం స్త్రీలకు అంతకంటే ముఖ్యం.
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే కేవలం డబ్బు సంపాదించడమనే కాదు. ఎమర్జెన్సీ టైమ్‌లో ఎవరి ముందూ తలవంచకుండా స్వతంత్రంగా నిలబడేలా గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది. దీనికోసం ముందుగా ప్రతీ నెలా ఎంత ఇన్కమ్ వస్తోంది. దానిలో నుంచి ఎంత ఖర్చవుతోందనే విషయాలను ఒక పేపర్ మీద పెట్టాలి.
నెలకు సరిపడే బడ్జెట్‌ను లెక్క వేసుకుని, అత్యవసర ఖర్చులు, పర్సనల్ , పొదుపు అనే మూడు విభాగాలుగా డబ్బులను విభజించాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా లేదంటే అనుకోని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చినా తట్టుకోవడానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్‌గా దాచి ఉంచడమనేది చాలా అవసరం. అలాగే ప్రతీ మహిళ కూడా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లపై పూర్తి నాలెడ్జ్ ఉండాలి.
కేవలం డబ్బును సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచితే ఇన్ఫ్లేషన్ వల్ల దాని వ్యాల్యూ తగ్గిపోతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, పీపీఎఫ్ వంటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లపైన నాలెడ్జ్ పెంచుకుని ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రొటెక్షన్ టూల్స్ కూడా ఉంటే మంచిది.

అనవసరమైన అప్పులు చేయడం వంటివి చేయకుండా.. ముందు నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే భవిష్యత్తులో ఎవరిపైనా భారం కాకుండా బతకొచ్చు. ఇంట్లో ఉన్న అందరి బ్యాంక్ అకౌంట్లు, ఇన్సూరెన్స్ బాండ్లు, ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో ప్రతీ మహిళ తెలుసుకోవడం కూడా ముఖ్యం.
కరెక్ట్ ఏజ్‌లో, ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ చిన్న చిన్న ఫైనాన్షియల్ అలవాట్లు చేసుకుంటే.. భవిష్యత్తులో ఎవరి హెల్ప్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. డబ్బు మన చేతుల్లో ఉన్నప్పుడే నిజమైన ఫ్రీడమ్ ఉంటుందన్న విషయం ప్రతీ మగువ తెలుసుకోవాలి.
Romance In Relationship : రిలేషన్షిప్లో లవ్ కనిపించడం లేదా? ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవుతుందా?





