Just NationalJust BusinessLatest News

2000 Rupee Notes : ఇంకా 6 వేల కోట్ల రూపాయల 2000 నోట్లు జనాల దగ్గరే.. మార్చుకోవడానికి ఇంకా టైమ్ ఉందా?

2000 Rupee Notes : మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో సుమారు 98.47 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది.

2000 Rupee Notes

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యంత కీలకమైన నిర్ణయంగా మారిన రూ. 2 వేల నోట్ల(2000 Rupee Notes) ఉపసంహరణ ప్రక్రియ ఇక ముగింపు దశకు చేరుకుంది. మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో సుమారు 98.47 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది.

మూడేళ్ల క్రితం ఈ నోట్లను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించిన కేంద్ర బ్యాంక్, ఇప్పటివరకు జరిగిన రికవరీకి సంబంధించిన పూర్తి గణాంకాలను అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. దీని ప్రకారం మార్కెట్‌లో ఈ నోట్ల వాటా సుమారు శూన్యానికి చేరుకున్నట్లు తేలింది.

భారత కరెన్సీ నిర్వహణలో భాగంగా 2023 మే 19 న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. ఆ సమయంలో మార్కెట్‌లో మొత్తం 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన 2 వేల నోట్లు చలామణిలో ఉండేవి. అయితే ఆర్బీఐ కంటిన్యూస్ మోనిటరింగ్, ప్రజల సహకారంతో ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీకి.. మార్కెట్‌లో మిగిలి ఉన్న నోట్ల విలువ కేవలం 5,451 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే మెజారిటీ నోట్లు గవర్నమెంట్ ఖజానాకు చేరిపోగా, ఇంకా కొద్ది మొత్తంలో నోట్లు మాత్రం ప్రజల వద్ద ఉండిపోయాయి.

అసలు ఈ పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేశారనే విషయానికి వస్తే, 2016 లో జరిగిన బ్లాక్ మనీ కంట్రోల్ చేయడానికి పాత ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు సమయంలో ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన కరెన్సీ కొరతను వెంటనే భర్తీ చేయడానికి ఆర్బీఐ ఈ రూ.2000 నోటును ప్రవేశపెట్టింది.

అయితే మార్కెట్‌లో చిన్న నోట్ల లభ్యత పెరిగిన తర్వాత, పెద్ద నోట్ల ద్వారా అక్రమ నిల్వలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావించి క్లీన్ నోట్ పాలసీలో భాగంగా వీటిని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. దీనికోసం మొదట 2023 సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చారు.

ఆ సమయంలో సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు బ్యాంకులలో నోట్లు మార్చుకోవడానికి, తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి ఒక్కసారిగా బ్యాంకుల ముందు క్యూ కట్టారు. దీంతో అప్పట్లో బ్యాంకుల వద్ద క్యూలైన్లు, రోజుకు ఇంత అనే లిమిట్ ఉండటంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు.

2000 Rupee Notes
2000 Rupee Notes

చిన్న వ్యాపారస్తులు రెండు వేల నోట్లను(2000 Rupee Notes) తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ప్రజలకు మరింత టైమ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ గడువును అక్టోబర్ 7 వరకు ఇచ్చిన ఆర్బీఐ.. ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఆఫీసుల్లో మార్చుకునేలా కంటిన్యూగా పొడిగిస్తూ వచ్చింది.

అయితే ఇప్పటికీ కొందరి వద్ద నోట్లు ఉండటంతో.. ఎవరి వద్దనైనా ఈ పెద్ద నోట్లు ఉండిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ మరోసారి చెబుతోంది. ఈ నోట్లు ఇప్పటికీ ఆర్బీఐ ఆఫీసుల్లో మార్చుకోవచ్చని లేదా తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఆ నోట్లను కూడా వీలైనంత త్వరగా ఆర్బీఐ కేంద్రాల ద్వారా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Enumeration : ఎన్యూమరేషన్ ఫామ్‌ సబ్‌మిట్‌కు 6 రోజులే గడువు.. ఆలస్యం చేస్తే మీ ఓటు గల్లంతే

Related Articles

Back to top button