Just NationalJust PoliticalLatest News

Annamalai : తొందరపడొద్దు..అన్నామలైకి బీజేపీ బుజ్జగింపులు

Annamalai : అన్నామలై సత్తా ఏంటనేది బీజేపీ అధిష్టానానికి తెలుసు. తక్కువ సమయంలోనే మోదీతో సహా బీజేపీ పెద్దల మనసు గెలుచుకున్న నేతగా పేరుంది

Annamalai

తమిళనాడులో బీజేపీని తక్కువ కాలంలోనే లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన నేత అన్నామలై(Annamalai)… అక్కడ ద్రవిడ పార్టీలకు తప్ప జాతీయ పార్టీల పేర్లు వినిపించే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి రాష్ట్రంలో కాషాయ పార్టీ గురించి తమిళ ప్రజలు మాట్లాడుకోవడమే కాదు 11 శాతానికి పైగా ఓట్లు సాధించేలా చేసిన ఘనత ఖచ్చితంగా అన్నామలైదే.

అయితే పార్టీలోని కొన్ని అంతర్గత విభేదాలు, పరిస్థితుల కారణంగా అన్నామలై(Annamalai)ని తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్నాడీఎంకే కీలక నేత పళనిస్వామి కారణంగానే బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం కూడా జరిగింది. అప్పటి నుంచే కాషాయ పార్టీకి అన్నామలై రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి.

తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత అవి నిజమయ్యాయి. అధికారికంగా అన్నామలై ఇంకా ప్రకటించకున్నా బీజేపీకి ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. నేరుగా అమిత్ షాతో భేటీ అయి రాజీనామా ఇచ్చినట్టు సమాచారం. అయితే తొందరపడొద్దంటూ అమిత్ షా, ఇతర సీనియర్ నేతలు వారించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఎందుకంటే అన్నామలై(Annamalai) సత్తా ఏంటనేది బీజేపీ అధిష్టానానికి తెలుసు. తక్కువ సమయంలోనే మోదీతో సహా బీజేపీ పెద్దల మనసు గెలుచుకున్న నేతగా పేరుంది. పార్టీని క్షేత్రస్థాయిలో అన్నామలై చాలా బలోపేతం చేసిన విషయంపై కూడా బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉంది. అందుకే రాజీనామా లేఖను ఆమోదించలేదు.

తొందరపడొద్దంటూ బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అన్నామలై చెబుతున్న ఇబ్బందులను పరిష్కరించి భవిష్యత్తుపై కీలక హామీలు ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ పెట్టి రాష్ట్రమంతా యాత్ర చేయాలని అన్నామలై ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు కూడా అర్థమవుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు అమిత్ షా కీలక సూచనలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Annamalai
Annamalai

సొంతంగా కొత్త పార్టీ ఆలోచన లేకుండా బీజేపీ నేతగానే యాత్ర చేయమని, అధిష్టానం నుంచి అన్ని సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారని జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడవుతోంది. పార్టీని వీడొద్దని, ఇకపై ఆయన నిర్ణయాలకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పినట్టు సమాచారం.

దీంతో పాటు రాజ్యసభ సభ్యునిగా తర్వాత కేంద్రమంత్రిగా అవకాశం ఇస్తామని ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధాని మోదీతో భేటీ కావాలని భావిస్తున్న అన్నామలై, ఆ భేటీ తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. మరి బీజేపీ పెద్దల ఆఫర్ ను అంగీకరించి పార్టీలో కొనసాగుతారో లేక సొంత పార్టీ వైపే మొగ్గుచూపుతారో అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.

Peddi Review : పెద్ది ఫస్ట్ రివ్యూ టాక్.. రామ్ చరణ్ నాన్-స్టాప్ బాక్సాఫీస్ రచ్చ

Related Articles

Back to top button