DK Shivakumar :కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్..ఈ నెల ముప్పై ఒకటిన ప్రమాణ స్వీకారం ?
DK Shivakumar : డీకే శివకుమార్ అనుచరులు డీకేనే తదుపరి సీఎం అని చెప్తుండగా, మరోవైపు సీనియర్ నేత జి. పరమేశ్వరకు కూడా అవకాశమివ్వాలని కొత్త వాదన కూడా తెరమీద ఉంది.
DK Shivakumar
కర్ణాటక రాజకీయాల్లో మూడు రోజుల నుంచి మళ్లీ పొలిటికల్ వేడి మొదలైంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. హస్తిన వేదికగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీలతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) విడివిడిగా భేటీ అయిన తర్వాత పొలిటికల్ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సీఎం సిద్ధరామయ్య ఈ రోజు తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ నెల 31 న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోందనే ప్రచారం జోరందుకుంది.
సీఎం సిద్ధరామయ్య మే 27న కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలవడానికి సమయం కోరడంతో.. ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడానికే సిద్ధరామయ్య అపాయింట్‌మెంట్ అడిగినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అంతకంటే ముందే సిద్ధరామయ్య తన అధికారిక నివాసం కావేరిలో డీకే శివకుమార్(DK Shivakumar)తో పాటు తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఒక ముఖ్యమైన అల్పాహార సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని విధాన సౌధలో ఒక కార్యక్రమానికి హాజరైన సిద్ధరామయ్యను మీడియా ప్రతినిధులు సీఎం మార్పు గురించి ప్రశ్నించగా.. దీనిపై తాను గురువారమే మాట్లాడతానని సమాధానం చెప్పడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
నిజానికి హస్తినలో జరిగిన అంతర్గత సమావేశాల్లో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యకు హైకమాండ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దానికి బదులుగా సిద్దరామయ్యకు రాజ్యసభ స్థానంతో పాటు కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలను అప్పజెబుతామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ బయటకు మాత్రం తాము కేవలం రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసనమండలి ఎన్నికల గురించే చర్చించామని, లీడర్‌షిప్ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
కాగా గతేడాది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్(DK Shivakumar)లు చెరో సగ కాలం పాలిస్తారనే ఒప్పందం ఉందన్న వార్తలు వినిపించాయి. పద్దెనిమిది నెలలుగా డీకే శివకుమార్ అనుచరులు డీకేనే తదుపరి సీఎం అని చెప్తుండగా, మరోవైపు సీనియర్ నేత జి. పరమేశ్వరకు కూడా అవకాశమివ్వాలని కొత్త వాదన కూడా తెరమీద ఉంది.

ఈ పొలిటికల్ పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించింది. మూడేళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని.. ఆ విషయం అర్థం అవడంతోనే ఇప్పుడు సిద్ధరామయ్యను మార్చాలని హైకమాండ్ డిసైడ్ అయిందని ఎద్దేవా చేసింది.
అంతేకాదు నెక్స్ట్ సీఎం ఎవరొచ్చినా సరే, కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర జోస్యం కూడా చెప్పారు. అంతర్గత గొడవల వల్ల కర్ణాటక పరిపాలన కుప్పకూలిందని, కర్ణాటకను సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేశారని విజయేంద్ర మండిపడ్డారు.
Peddi : పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తి.. చీఫ్ గెస్ట్‌గా ఆ హీరో వస్తున్నారా?





