Just NationalLatest News

Police : నిరసన ప్రదర్శనలో యువతిపై ఖాకీ నీడ.. డిఫెన్స్‌లో పడిన పోలీస్ శాఖ

Police : ముంబయిలోని దాదర్ ప్రాంతంలో నీట్ పేపర్ లీకేజ్ అంశంపై స్టూడెంట్స్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో దారుణమైన ఘటన తాలూకా వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Police

ప్రజాస్వామ్యంలో న్యాయం జరగాలంటూ గొంతెత్తినప్పుడు ఆ గొంతుకు తోడుగా నిలవాల్సిన పోలీసుల చేతులే, అభయం ఇవ్వాల్సిన ఆ ఖాకీలే అవకాశవాదులుగా మారుతూ, చిల్లర వేషాలు వేస్తే సామాన్యులు ఇక ఎవరిని నమ్ముతారు?

సొసైటీలో మహిళలకు రక్షణ కవచంలా ఉంటారని భావించే వ్యవస్థలే .. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినప్పుడు ఆ వేదన ఎవరికీ కూడా మాటలకు అందదు. ముంబయిలోని ధర్నా చౌక్‌లో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా..తమ హక్కుల కోసం పోరాడుతున్న ఒక విద్యార్థినికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమంది గుండెలను పిండేస్తోంది.

ముంబయిలోని దాదర్ ప్రాంతంలో నీట్ పేపర్ లీకేజ్ అంశంపై స్టూడెంట్స్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో దారుణమైన ఘటన తాలూకా వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పౌర దుస్తులలో ఉన్న ఒక పోలీస్(Police) అధికారి, నిరసన వ్యక్తం చేస్తున్న ఓ విద్యార్ధిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, విచక్షణారహితంగా ఆమెను పట్టుకుని ఈడ్చుకెళ్లడం ఓ కెమెరాకు చిక్కింది.

ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రక్షణ కల్పించాల్సిన పురుష పోలీస్(Police) అధికారి ఒక యువతి పట్ల ఇలా అభ్యంతరకరంగా ప్రవర్తించడం ఏంటని, అక్కడ ఉన్న మహిళా పోలీసులను ఎందుకు రంగంలోకి దించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ..ఈ వ్యవహారంపై ముంబయి పోలీసులు ఇచ్చిన వివరణ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ వీడియోను తప్పుగా చిత్రీకరించారని, సదరు అధికారి ఒక ఆందోళనకారుడిని లాగుతున్న సమయంలో ఈ యువతి మధ్యలోకి వచ్చిందని వారు కొత్త విషయాన్ని తెరమీదకు తెచ్చారు.

అంతేకాకుండా ఆ అధికారి అమ్మాయి వైపు కాకుండా వేరే వైపు చూస్తున్న సమయంలో ఇదంతా జరిగిందని, సీనియర్ అధికారులు దీనిపై విచారణ కూడా జరిపి అందులో ఎలాంటి పొరపాటూ లేదని తేల్చారని తెలిపారు.

Police
Police

పోలీసుల సమర్థనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక యువతిని పట్టుకున్నానని తెలిసిన తర్వాత కూడా ఆ పోలీస్ అధికారి ఎందుకు వెనక్కి తగ్గలేదని, ఆమెను తప్పుగా పట్టుకున్నానని చూసిన తర్వాత కూడా చెయ్యి ఎందుకు తీయలేదని ప్రశ్నిస్తున్నారు. వీడియోలోని తర్వాతి భాగంలో ఆ పోలీస్ అధికారి సదరు యువతిని స్పష్టంగా చూస్తూనే ఆమెను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.

ఇటీవలే పోలీస్ శాఖలో ఒక పోలీస్.. ఆందోళనకారులను నకిలీ డ్రగ్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించగా..ఆ పోలీసు అధికారి సస్పెండ్ అయ్యారు. అలా ఆయన సస్పెండ్ అయిన మరుసటి రోజే ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Block Chain Technology : మీ భూమి ఇక వంద శాతం సేఫ్.. బ్లాక్‌ చెయిన్ ప్రొటెక్షన్‌ నిజంగానే రక్షణ ఇస్తుందా?

Related Articles

Back to top button