Just SportsLatest News

India Squad : బుమ్రా,జడేజా రీ ఎంట్రీ.. లంకతో టెస్టులకు భారత జట్టు ఇదే

India Squad : గాయం వల్ల జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

India Squad

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. గాయం వల్ల జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

అలాగే దేశీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ సరాంశ్ జైన్‌కు తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కింది. గాయం వల్ల వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ సరాంశ్ జైన్‌ను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ తరఫున 131 ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించిన జైన్, ఇటీవల శ్రీలంక ఎ జట్టుపై ఇండియా ఎ తరఫున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బుమ్రా మోకాలి గాయం, వాషింగ్టన్ సుందర్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా.. తొలి టెస్టుకు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. సుందర్ అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. అయితే బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని తెలిపింది.

నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణాలను గాయాల వల్ల ఈ సిరీస్‌కు పక్కన పెట్టారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఈ సిరీస్ భారత్‌కు కీలకం కావడంతో బలమైన జట్టునే ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్,  జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో యువ, అనుభవజ్ఞులైన బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు.

శ్రీలంక పిచ్‌లకు తగినట్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు(India Squad) ఆగస్టు 7వ తేదీ నుంచి కొలంబోలో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఆగస్టు 15 నుండి గాలే వేదికగా మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుండి కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరుగుతుంది.

India Squad
India Squad

లంకతో టెస్టులకు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ , యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్, సరాంశ్ జైన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్

Family Register Certificate : త్వరలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్.. ఇది ఎందుకు? ఎవరికి ఉపయోగం?

Related Articles

Back to top button