Hyderabad Municipal Act : క్యూర్-1 పేరుతో ఆటోమేటిక్ మ్యూటేషన్..సింగిల్ బిల్లు మ్యాజిక్..70 ఏళ్ల నాటి చట్టాలకు చెక్..
Hyderabad Municipal Act : ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్లు, డ్రైనేజ్ ఛార్జీలు, పారిశుద్ధ్య బకాయిలన్నింటిని కూడా కలిపి క్యూర్–1 పేరుతో ఒక్కటే పూర్తి బిల్లు జారీ చేస్తారు.
Hyderabad Municipal Act
అన్ని రంగాలలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న హైదరాబాదీలకు..తమ పరిపాలనను మరింత చేరువ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సిటీ ప్రజలను వేధిస్తున్న మున్సిపల్ సమస్యలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు ఫుల్‌స్టాప్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి లైవ్ మానిటరింగ్‌లో రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టం అఫీషియల్‌గా అమల్లోకి వచ్చింది. పాతకాలపు రొటీన్ పద్ధతులకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తూ.. తెచ్చిన ఈ విప్లవాత్మక చట్టం హైదరాబాద్ నగర పాలనను(Hyderabad Municipal Act) నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లనుంది.
ఈ(Hyderabad Municipal Act) కొత్త పాలనా సంస్కరణల్లో భాగంగా క్యూర్ (CURE) అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జీహెచ్‌ఎంసీ(Hyderabad Municipal Act), పోలీస్, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్, ఆర్టీసీతో పాటు అత్యంత కీలకమైన హైడ్రా వంటి మెయిన్ గవర్నమెంట్ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చారు. దీనివల్ల వివిధ శాఖల మధ్య కో ఆర్డినేషన్ పెరిగి ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయి.
ముఖ్యంగా ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆటోమేటిక్ మ్యూటేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ప్రతి ప్రాపర్టీకి ఒక స్పెషల్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్లు, డ్రైనేజ్ ఛార్జీలు, పారిశుద్ధ్య బకాయిలన్నింటిని కూడా కలిపి క్యూర్–1 పేరుతో ఒక్కటే పూర్తి బిల్లు జారీ చేస్తారు. అలాగే గైడ్‌లైన్ వ్యాల్యూ ఆధారంగా లెక్కిచే ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు ప్రతీ ఏడాది గరిష్ఠంగా 10 శాతానికి మించకుండా లిమిట్ విధించి ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్త పడ్డారు.
అంతేకాకుండా సిటీలో ఒక శాఖ వేసిన కొత్త రోడ్డును మరొక శాఖ డ్రైనేజీ కోసమో, కేబుల్స్ కోసమో తర్వాత రోజే తవ్వేసే చెత్త పద్ధతికి చెక్ పెడుతూ యుటిలిటీ కోఆర్డినేషన్ కమిటీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక భవన పర్మిషన్‌ల కోసం ఆన్‌లైన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా, నిర్ణీత గడువులోగా పర్మిషన్లు రాకపోతే చట్టబద్ధంగా డీమ్డ్ అప్రూవల్ వచ్చేలా అవకాశాన్ని కల్పించారు. చిన్న చిన్న నిర్మాణ ఉల్లంఘనలకు క్రిమినల్ కేసుల ప్లేస్‌లో సివిల్ జరీమానాలతో సరిపెడతారు. చెరువులు, నాలాలు, గవర్నమెంట్ పార్కుల రక్షణ కోసం హైడ్రాకు పూర్తి స్థాయి చట్టబద్ధ పవర్స్ కల్పిస్తూ అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలకు మార్గాన్ని సుగమం చేశారు.
1955 నాటి పాత చట్టంలో ఉన్న కాలం చెల్లిన టాంగాలు, ఎద్దుల బండ్ల ట్యాక్స్‌లు, ఆక్ట్రాయ్ వంటి 100కు పైగా అవసరం లేని రూల్స్ అన్నిటిని రద్దు చేసి 70 ఏళ్ల నాటి పాత సిస్టమ్‌ను క్లీన్ చేశారు. సిటీ సెక్యూరిటీ, డిజాస్టర్ల నిర్వహణ కోసం క్యూర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అలాగే సొసైటీలో బ్యాలెన్సింగ్ కోసం జెండర్ ఇన్‌క్లూజన్ సెల్, గిగ్ వర్కర్లు విశ్రాంతి కోసం రెస్ట్ ఏరియాలు అలాగే చిరు వ్యాపారుల కోసం స్పెషల్ వెండింగ్ జోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ కొత్త చట్టం హైదరాబాదీలకు గ్లోబల్ స్థాయి జీవన ప్రమాణాలను, చాలా ఈజీగా ఉండే మున్సిపల్ సర్వీసులను అందించడంలో ఒక గేమ్ ఛేంజర్‌లా నిలవబోతోంది.
Reassurance : ఆమె అలిగినప్పుడు మీరు ఇవ్వాల్సిన అసలైన భరోసా ఇదే..ఈగో పక్కనబెట్టి ఈ ఒక్క పని చేయండి..





