Ration Card : జూలై 31 తర్వాత వారికి ఉచిత రేషన్ కట్? మీకు రేషన్ కార్డ్ ఉంటే వెంటనే ఈ పని చేయండి..
Ration Card : ఇ- కేవైసీ చేయించుకోవడం కోసం మీ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులందరివి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Ration Card
సంక్షేమ పథకాలు నిజమైన పేదవాడికే అందాలి.. అర్హత లేని ఫేక్ కార్డుదారులకు షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో తెలంగాణ పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను స్పీడప్ చేసింది. దీనిలో భాగంగానే తెలంగాణలోని ప్రతీ రేషన్ కార్డుదారుడికి ఇ-కేవైసీ తప్పనిసరి చేసి .. జూలై 31వ తేదీని దీనికి చివరి గడువుగా నిర్ణయించింది.
అయితే ఈ గడువు దాటేలోగా ఇ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డు(Ration Card) రద్దయ్యే ప్రమాదం ఉంది. సబ్సిడీ బియ్యం, సరుకులు మాత్రమే కాదు, రేషన్ కార్డును బేస్ చేసుకుని వచ్చే ఆరోగ్యశ్రీ, ఇతర గవర్నమెంట్ స్కీమ్లు కూడా ఆగిపోతాయి.
ఈ నిబంధనలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో యజమాని ఒక్కరే వెళ్లి ఇ-కేవైసీ కోసం వేలిముద్ర వేస్తే సరిపోదు. రేషన్ కార్డు(Ration Card)లో పేర్లు ఉన్న ప్రతీ ఒక్కరూ అంటే ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా తమ వివరాలను ధృవీకరించుకోవాలి.

దీని కోసం మీ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులందరివి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.ఈ ఇ- కేవైసీ చేయించుకోవడం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
మీ గ్రామంలో కానీ వీధిలో కానీ ఉణ్న రేషన్ షాపులో అయినా లేదంటే దగ్గరలోని మీసేవా కేంద్రంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అయితే డెడ్ లైన్ దగ్గర పడకుతుంది కాబట్టి.. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు, క్యూ లైన్ల గోల లేకుండా ఉండాలి అంటే వెంటనే వెళ్లి ఈ ఇ-కేవైసీ పని పూర్తి చేసుకోండి.
Date Of Birth : ఈరోజు ఏ నెంబర్ వారికి ధనలాభం, ఎవరికి హెచ్చరిక?





