Toilets: వెస్ట్రన్ టాయిలెట్స్ మంచివా? ఇండియన్ టాయిలెట్స్ మంచివా?
Toilets: భారతీయ సాంప్రదాయ టాయిలెట్ సంస్కృతిలో భాగమైన ఈ పొజిషన్‌కు జీర్ణక్రియ , పెల్విక్ ఆరోగ్యంపై (Pelvic Health) అద్భుతమైన శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి.
Toilets
ఇప్పుడు ఎవరింట్లో చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ (Western Toilets) వాడకం పెరగడంతో, డీప్ స్క్వాటింగ్ (Deep Squatting) లేదా పూర్తిగా కూర్చుని ఉండే భంగిమ మన డైలీ లైఫ్ నుంచి కనుమరుగైంది. కానీ భారతీయ సాంప్రదాయ టాయిలెట్ సంస్కృతిలో భాగమైన ఈ పొజిషన్‌కు జీర్ణక్రియ , పెల్విక్ ఆరోగ్యంపై (Pelvic Health) అద్భుతమైన శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి.
ఇండియన్ టాయిలెట్స్(Toilets)లో పూర్తిగా స్క్వాటింగ్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు, మానవ మల విసర్జన నాళంలో ఉండే ముఖ్యమైన కండరం అయిన ప్యూబోరెక్టాలిస్ కండరం (Puborectalis Muscle) పూర్తిగా సడలి, విశ్రాంతి పొందుతుంది. ఈ సడలింపు వల్ల మలాశయం (Rectum) ,మలద్వారం (Anus) మధ్య ఉన్న కోణం (Anorectal Angle) నిటారుగా (Straightened) మారుతుంది. ఈ నిటారుగా ఉండే మార్గం వల్ల, పెద్ద ప్రేగులోంచి మలం సులభంగా, వేగంగా అనేకంటే పూర్తిగా తొలగిపోతుందని చెప్పొచ్చు.

వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేసినపుడు నిలబడి ఉండే భంగిమలో ఈ కోణం వంగి ఉంటుంది. దీని వల్ల మల విసర్జన అసంపూర్తిగా ఉండి, మలబద్ధకం (Constipation), హెమోరాయిడ్స్ (Hemorrhoids), ఇతర ప్రేగు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డీప్ స్క్వాటింగ్ కేవలం విసర్జనకే కాక, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు (Pelvic Floor Muscles) సహజమైన వ్యాయామంగా పనిచేస్తుంది.
ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ఆరోగ్యానికి , మూత్రాశయంపై మెరుగైన నియంత్రణకు (Bladder Control) సహాయపడుతుంది. స్క్వాటింగ్ పొజిషన్ అనేది శరీరం యొక్క సహజమైన జీవక్రియ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది ఆసనాన్ని సరిదిద్ది, మొత్తం కండరాల బలాన్ని పెంచుతుంది.



