Budget :చరిత్రలో రెండోసారి ఆదివారం రోజే బడ్జెట్ ప్రవేశం..మరి ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు? ఏంటా స్పెషల్?
Budget :ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తను వరుసగా 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.
Budget
దేశ ఆర్థిక భవిష్యత్తును ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ (Budget )- 2026 కు రంగం సిద్ధమైపోయింది. ఈసారి బడ్జెట్ తేదీల విషయంలో సామాన్య ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెర దించుతూ.. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తను వరుసగా 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. దీనివల్ల మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డుకు ఆమె చేరువవుతారు.
జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్(Budget ) సమావేశాలు ప్రారంభమవుతాయి. జనవరి 29న దేశ ఆర్థిక స్థితిగతులను వివరించే ‘ఆర్థిక సర్వే’ (Economic Survey) ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.
ఫిబ్రవరి 1 ఆదివారం రోజు లోక్‌సభలో ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1 ఆదివారం అయినా కూడా ఎక్కడా జాప్యం జరగకుండా ఆ రోజే బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా సెలవు రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇది రెండోసారి కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఈ బడ్జెట్(Budget )లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్నులో ఏవైనా మినహాయింపులు ఇస్తారా? పెరిగిన ధరల నుంచి ఉపశమనం లభిస్తుందా? అనే అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. సమావేశాల తొలి విడత ఫిబ్రవరి 13 వరకు సాగనుండగా, మళ్లీ మార్చి 9 నుంచి రెండో విడత ప్రారంభమవుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థలో ఫిబ్రవరి 1వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈసారి ఆ తేదీ ఆదివారం రావడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సెలవు దినాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించరు, కానీ బడ్జెట్ విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీని వెనుక బలమైన కారణాలు, ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో.. ఒక కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టడం ఇది రెండోసారి అయితే తొలిసారి ఎప్పుడంటే.. 1999 ఫిబ్రవరి 27న అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజే మరో రికార్డు కూడా నమోదైంది. అంతకుముందు వరకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతి ప్రకారం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ చదివేవారు, కానీ యశ్వంత్ సిన్హా దానిని ఉదయం 11 గంటలకు మార్చారు.

సండే ఎందుకు పెడుతున్నారు?..నిజానికి 2017 నుంచి బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) ప్రారంభమయ్యే నాటికే బడ్జెట్ ప్రతిపాదనలన్నీ అమల్లోకి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం అయినా, ఆ తేదీని మారిస్తే పనుల్లో జాప్యం జరుగుతుందని భావించి, సెలవు రోజు అయినా సరే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు సెలవులో ఉన్నా, ఇన్వెస్టర్లకు బడ్జెట్ పై విశ్లేషణ చేసుకోవడానికి మాత్రం కావాల్సినంత సమయం దొరుకుతుంది.
బడ్జెట్ 2026 – ప్రధాన ఎజెండా ఏమిటి అంటే.. ఈ సమావేశాలలో ప్రభుత్వం ప్రధానంగా ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో కొన్ని కీలక బిల్లులను ముందుకు తీసుకురాబోతోంది. దీనిలో ముఖ్యంగా..
ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election).. దీనిపై స్పష్టమైన ప్రకటన లేదా బిల్లు వచ్చే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను సంస్కరణలు.. పాత పన్ను పద్ధతికి స్వస్తి పలికి, కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) మరింత ఆకర్షణీయంగా మార్చడం.
డిజిటల్ అగ్రి మిషన్.. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని పెంచడానికి భారీ నిధుల కేటాయింపు.
ఇన్సూరెన్స్ సంస్కరణలు.. బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (FDI) అవకాశం కల్పించే బిల్లు.
మరోవైపు ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు సృష్టిస్తారు. అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే నిలుస్తారు.మొత్తంగా సామాన్యులకిచ్చే పన్ను ఊరటలు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల వంటివి ఈ బడ్జెట్‌లో టాప్ ప్రయారిటీగా ఉండబోతున్నాయి.
Free Travel:మహిళలకే కాదు వారికి కూడా ఇకపై ఫ్రీ బస్సు జర్నీ.. ఏపీ,తెలంగాణలో ఎప్పటి నుంచి అమలు?




2 Comments