Bloating: కడుపు ఉబ్బరం సమస్యకు కారణాలేంటి?దీనికి చెక్ పెట్టడం ఎలా?
Bloating: బ్లోటింగ్ ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు.
Bloating
ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల ఇప్పుడు చాలామంది ఎదుర్కొనే అతి సాధారణ అలాగే అతిపెద్ద సమస్య బ్లోటింగ్(Bloating) లేదా కడుపు ఉబ్బరం. తిన్న కొద్దిసేపటికి కానీ, తినే టైమ్ దాటిపోయినా కూడా వెంటనే కడుపు బిగుతుగా ఉండటం, గాలి నిండినట్లు అనిపించడం, అసౌకర్యంగా ఉండటం వంటివి బ్లోటింగ్ లక్షణాలు. దీనిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు.
బ్లోటింగ్(Bloating) రావడానికి ప్రధాన కారణం ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం. ముక్కలు ముక్కలుగా మింగడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్తుంది. అలాగే సోడా, కూల్ డ్రింక్స్ , ఉప్పు ఎక్కువగా ఉన్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. శరీరంలో నీరు నిలిచిపోయి ఉబ్బరం వస్తుంది.
దీనికి ఇంటి వద్దే సహజసిద్ధంగా చెక్ పెట్టొచ్చు. భోజనం చేసిన తర్వాత వాము (Ajwain) కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం టీ లేదా అల్లం రసం కూడా కడుపులో గ్యాస్ ను బయటకు పంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనా ఆకుల కషాయం తాగడం వల్ల పేగుల్లోని కండరాలు రిలాక్స్ అయ్యి బ్లోటింగ్ తగ్గుతుంది.

అలాగే జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేయొచ్చు. ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు లేదా మజ్జిగను మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం మానుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 15 నిమిషాల పాటు అటు ఇటు నడవడం వల్ల బ్లోటింగ్ సమస్యను 90 శాతం వరకు తగ్గించొచ్చు. మీ కడుపు ఆరోగ్యంగా ఉంటేనే మీరు, అలాగే మీ రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది.




One Comment