Just TelanganaJust Political

Kaleshwaram :16నెలలు.. 650 పేజీలు.. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ బుక్ రిలీజ్

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై 650 పేజీల కమిషన్ నివేదిక విడుదల. నిర్మాణ లోపాలు, ఆర్థిక అంశాలపై కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Kaleshwaram

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కలకలం సృష్టించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ తుది నివేదిక..ఎట్టకేలకు ప్రభుత్వం వద్దకు చేరింది. దాదాపు 16 నెలల పాటు సాగిన విచారణ తర్వాత, ఈ కమిషన్ 650 పేజీలకు పైగా ఉన్న నివేదికను ప్రభుత్వ అధికారులకు అప్పగించింది.

Kaleshwaram
Kaleshwaram

ఈ కమిషన్(Commission) ప్రత్యేకంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై బాగా ఫోకస్ చేసింది. గత ప్రభుత్వం తరపున తీసుకున్న నిర్ణయాలు, వాటికి సంబంధించిన కేబినెట్ మినిట్స్, అధికారులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఇంజినీర్ల నుంచి మొత్తం 119 మంది వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఆమోదించకుండానే చేసిన చాలా డిజైన్ మార్పులు, నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు, ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అసంభవాలు అన్నీ నివేదికలో బయటపడ్డాయి.

కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్‌ను నిర్మించిన సమయంలో అనుకుంటే, కొంతమంది అధికారులు సంబంధిత ఏజెన్సీల అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ డిజైన్ మార్చారని కమిషన్ పేర్కొంది. నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాల్సిన సీనియర్ అధికారులతో సమన్వయం లేకుండా, ఫీల్డ్ నుంచే డీల్డ్ తీసుకున్నట్లు తేల్చింది. పనులు ప్రారంభించడంలో సీనియారిటీని పక్కన పెడుతూ, నేరుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేసింది.

ప్రాజెక్ట్‌కు మంజూరైన బడ్జెట్‌పై కూడా బ్యాంక్ మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా, హైలెవల్ కమిటీ ఫైనల్ చేయకుండానే నిధులు విడుదల చేశారని కమిషన్ తేల్చింది. ఇంజినీర్లు ..ఐఏఎస్‌ల మధ్య సంబంధాలలో స్పష్టత అవసరం ఉండాల్సిన సమయంలో, కమ్యూనికేషన్ కొరవయ్యేదని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం గ్రౌండ్ సిబ్బందితో నేరుగా మాట్లాడడం వల్ల, పెద్దలు తీసుకున్న నిర్ణయాలను మిగతా ఉన్నతాధికారులకు ముందుగా తెలిసే పరిస్థితి లేదని వెల్లడించింది.

ఈ నివేదికలో కమిషన్ ముఖ్యంగా మూడు అంశాలపై చాలా క్లియర్‌గా మాట్లాడింది . ప్రాజెక్ట్ డిజైన్ చేసిన తీరు, నిర్మాణ పరిస్థితుల్లో ఉన్న లోపాలు, ఆర్థిక పరమైన అప్రమత్తతల సమస్యలను వివరించింది. చివరగా, అధికారుల తప్పిదాలపై లీగల్‌గా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు కూడా జత చేసింది.తాము పూర్తి స్థాయిలో ముఖ్యమైన విషయాలపై పరిశీలన చేసి, ముఖ్యమైన పాయింట్లను క్లియర్‌గా ప్రభుత్వానికి అందించినట్లు కమిషన్ చెప్పింది.
మొత్తంగా చెప్పాలంటే, కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై ఇప్పటివరకు బయటికి రాని ఎన్నో విషయాలు ఈ నివేదికతో బయటపడినట్టు తెలుస్తోంది.

Kaleshwaram
Kaleshwaram

కాగా తెలంగాణ(Telangana)లో గోదావరి నది నీటిని ఎత్తి పర్యవేక్షణతో సాగునీరు అందించే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా 2016లో ప్రారంభించబడింది. దాదాపు 80,500 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు, 13 జిల్లాలకు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించబడింది. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్ స్టేషన్లు, 1800 కిలోమీటర్ల కాలువలు, భూగర్భ పంపులు , ఆసియాలో అతి పెద్ద సర్జ్ పూల్ నిర్మించడం ఇందులో ముఖ్యాంశాలు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీ నీటిని 90 రోజులపాటు ఎత్తుకుని కిందకు వదలాలనే ఉద్దేశంతో నిర్మించారు.

అయితే ఈ కేసు కేవలం నిర్మాణ లోపాలు కాదు, పెద్ద స్థాయిలో ఆర్థిక, నిర్వహణ లోపాలూ, రాజకీయ ఒత్తిడి అంశాలూ కలిపి ఉన్న ఒక సీరియస్ వ్యవహారంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ రిపోర్టును రాబోయే అసెంబ్లీలో చర్చించి బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్డడానికి సీఎం రేవంత్ (Revanth Reddy) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకునే చర్యలు, తర్వాత రాజకీయ వర్గాలలో జరగనున్న అలజడిపై అందరి దృష్టి పడింది.

Also Read: Black Tea: తెల్ల జుట్టును నల్లగా మార్చే సీక్రెట్ టీ ..మీకోసమే

Scrapping: కాలం చెల్లిన బండ్ల కథ..స్క్రాపింగ్ విధానంలో సవాళ్లు

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button