High Heels :కాలం మార్చిన ఫ్యాషన్ కథ .. హైహీల్స్ వెనుక రహస్యం !
High Heels: "హైహీల్స్ ఇప్పుడు గ్లామర్ చిహ్నంగా కనిపిస్తున్నా, అసలులో ఇవి మగవాళ్ల కోసం ప్రారంభమయ్యాయి! పెర్షియన్ వీరుల నుంచి ఫ్యాషన్ రాణుల వరకు ప్రయాణించిన హైహీల్స్ చరిత్ర తెలుసుకోండి.

High Heels
ఇప్పుడు మహిళల గ్లామర్‌ను పెంచే ఫ్యాషన్ ఐకాన్… ‘హై హీల్స్’. సెలబ్రిటీ స్టైల్ల్లో భాగం. స్టేజీ పై నడిచే మోడళ్ల నుంచి, షాదీ వేదికపై మెరిసే పెళ్లికూతురు వరకూ.. హై హీల్స్ మన ఫ్యాషన్ ప్రపంచంలో ఓ స్ట్రాంగ్ ప్లేస్‌ను సంపాదించాయి. కానీ ఈ హైలైట్ ఫ్యాషన్ ఐటమ్ అసలు సిసలు లక్ష్యం ఏంటో తెలుసా..? అవి మగాళ్లకోసం తయారైనవి. అవును, షాక్ అవుతున్నారా? కానీ ఇదే నిజం.
ఫ్యాషన్ మాత్రమే కాదు.. స్టేటస్, శక్తి, యుద్ధ విద్యలో భాగంగా మొదలైన హైహీల్స్(high heels) ప్రయాణం, ఇప్పటి గ్లామర్ వరల్డ్‌కి ఎలా చేరింది అనేది నిజంగా ఆసక్తికరమే. కొన్ని దశాబ్దాల క్రితం పెర్షియన్ సైనికులు(Persian soldiers ) గుర్రపు మీద నుంచి బాణాలు వేసేటప్పుడు ఎత్తుగా కనిపించేందుకు వీటిని ధరించేవారు. అడుగులపై పట్టు, రక్తాన్ని కదిలించే జ్వాల… ఈ రెండు అవసరాలకూ హైహీల్స్ మిత్రులయ్యాయి. ఆ హీల్స్‌తో వారికొచ్చే గౌరవం వేరు. వీరుడే అనిపించే స్థాయి వేరు. పటిష్టంగా , బలంగా కనిపించాలంటే హైహీల్స్ అవసరమనేది అప్పటి ట్రెండ్ ఫిక్స్ అయిపోయింది.

ఆ తర్వాత కొన్ని దశాబ్దాల్లో ఈ ట్రెండ్ ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్లకు చేరింది. అప్పుడు మగవాళ్ల ఫ్యాషన్‌లో ఇది ఒక రాజ్యాధికారం లాంటి చిహ్నంగా మారిపోయింది. నల్ల బూట్ల కింద ఎర్ర రంగు హీల్స్(Louis XIV red heels). ఇది రాజులూ, పవర్ఫుల్ లీడర్లకు మాత్రమే ఇబ్బంది లేని గుర్తింపు. 1673లో ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీస్ రెడ్ సోల్స్‌తో కూడిన హైహీల్స్(high heels ) బూట్లను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఫ్యాషన్‌కు అసలైన రాజసం వచ్చేసింది. ఇకపై సామాన్యుడు ఎత్తుగా కనిపించాలంటే, హీల్స్ వేసుకోవడమే కాదు, సామాజికంగా ఆ స్థాయి ఉన్న వాడిగా కూడా కనిపించాల్సిన అవసరం వచ్చింది.
అలాగే ఈ ఫ్యాషన్ మహిళల వరకూ చేరింది మాత్రం దాదాపు వందేళ్ల తర్వాత. ఐరోపాలో ఉన్నత వర్గ మహిళలు మాత్రమే మొదట వీటిని వేసుకోవడానికి ప్రారంభించారు. చీరపై హీల్స్ కాదు, మాస్క్ పార్టీల్లో, సామాజిక వేడుకల్లో, రాజ కోర్టుల్లో… ఇవి ప్రత్యేక శ్రేణిలో ఉండేవి. ఈ హీల్స్ ఉన్నవారే ఏదో క్లాస్ ఉన్నవాళ్లలా సమాజం వారిని చూసేది. హైహీల్స్కి ఉన్న చరిత్ర చూసుకుంటే… ఇవి ఏకంగా ఓ అధికార చిహ్నంలా ఉండేవని చెప్పవచ్చు.

కాని 1740 తర్వాత ఈ ట్రెండ్‌కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. పురుషులు హైహీల్స్ (high heels) ధరిస్తే అది సమాజానికి తగదన్న అభిప్రాయం ఊపందుకుంది. అలా ఒకప్పుడు వీరుల స్టేటస్ సింబల్‌గా మొదలైన హైహీల్స్… కాలక్రమంలో మహిళల అందాన్ని ఇంకా కొత్తగా చెప్పే సాధనంగా మారిపోయాయి. ఇప్పుడు మనం హైహీల్స్ చూస్తే గ్లామర్ అని అనిపిస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే… మగాళ్లు ఖడ్గం పట్టుకుని వేసే బూట్లలోని ఉక్కు గమ్మత్తు. ఇప్పుడు అమ్మాయిల షాపింగ్ లిస్టులోని మిల్కీ గ్లామర్ అన్నమాట. కాలం మారితే… స్టేటస్ కూడా స్టైల్‌గా ఎలా మారుతుందో… హైహీల్స్ చరిత్ర మనందరి కళ్లముందే నిలిచే ఉదాహరణ.
Also Read: Black Tea: తెల్ల జుట్టును నల్లగా మార్చే సీక్రెట్ టీ ..మీకోసమే
2 Comments