Just EntertainmentLatest News

Trisha : విజయ్ తో లవ్ ఎఫైర్ ?…ప్రేమే సర్వస్వం కాదన్న త్రిష

Trisha : త్రిష ఇన్ స్టాలో పెట్టిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త గందరగోళ పరిస్థితిని కూడా క్రియేట్ చేశాయి

Trisha

సెలబ్రిటీలు ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పరు. బయట తమపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టే ఉద్దేశంతోనూ లేదా అవి నిజమే అని అర్థం వచ్చేలా పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ప్రస్తుతం హీరోయిన్ త్రిష కూడా ఇదే ఫాలో అవుతోంది. గత కొన్ని రోజులుగా త్రిష(Trisha) తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. తమిళ హీరో విజయ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.

త్రిష(Trisha) కారణంగానే విజయ్ తన భార్యతో విడిపోతున్నట్టు, విడాకులు కోరినట్టు కూడా దాదాపుగా చాలా మంది అభిప్రాయానికొచ్చేశారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కొన్నిసార్లు పుకార్లుగా కొట్టిపారేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో నిజం కూడా ఉండొచ్చు. సినిమా పరిశ్రమలో పెద్ద ఇబ్బందేమీ ఉండదు కూడా.

కానీ రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ కు త్రిషతో ప్రేమ వ్యవహారం ఉందంటూ వస్తున్న వార్తలు తలనొప్పిగా మారాయి. అదే సమయంలో భార్య కూడా విడాకుల కోసం కోర్టుకెక్కడం, ఓ వివాహ వేడుకకు త్రిషతో కలిసి విజయ్ బహిరంగంగా హాజరవడం వంటి పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక విజయ్ తో త్రిష పెళ్లి మాత్రమే మిగిలిందన్న వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా త్రిష ఇన్ స్టాలో పెట్టిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త గందరగోళ పరిస్థితిని కూడా క్రియేట్ చేశాయి. ఆమె షేర్ చేసిన పోస్టులో ఇలా ఉంది. ప్రస్తుతం నేను జీవితంలో కొత్త దశలో ఉన్నాను. ఎవరితోనూ వాదించాలనే ఉద్దేశం లేదు.

మీరు ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెప్పినా, మీరు చెప్పిందే సరైందని అనేస్తాను. అది నేను అంగీకరిస్తున్నానని కాదు, మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. సరైందిగా ఉండటం కంటే ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమని రాసుకొచ్చారు.

Trisha
Trisha

మీరు ఇతరుల అభిప్రాయాలను, వైఖరులను నియంత్రించలేరనీ, అలాగని శాసించలేరనీ, చేయగలిగిందల్లా జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే అంటూ రాసుకొచ్చారు. మంచి వ్యక్తిగా ఉండండి, నిజాయితీతో జీవించండి, నిజాయితీగా మాట్లాడండి…ఇదే మీ జీవితంలో అత్యుత్తమ రోజు అని మీరు తెలుసుకుంటే హాయిగా నిద్రపోగలరు అని తన పోస్టులో త్రిష రాసుకొచ్చారు.

అలాగే ప్రేమే సర్వస్వం కాదనీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదనే కోట్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇది నిజం అని ముగింపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పెట్టిన పోస్ట్ పలురకాల చర్చలకు దారితీసింది. అసలు ఆమె చెప్పాలనకున్న విషయాన్ని సూటిగా చెప్పలేక ఇలా పరోక్షంగా పోస్టులు పెడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష చిరంజీవితో విశ్వంభర, సూర్యకు జోడీగా కరుప్పు చిత్రాల్లో నటిస్తున్నారు.

Tamilnadu Elections : తమిళనాడు ఎన్నికలపై సంచలన సర్వే…గెలిచేది ఎవరో తెలుసా ?

Related Articles

Back to top button