Egg Freezing : పెళ్లి లేట్ అయినా నో టెన్షన్.. ఎగ్ ఫ్రీజింగ్‌కు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది?
Egg Freezing : ఫ్యూచర్‌లో మాతృత్వానికి ప్రాబ్లెం అవుతుందేమోనని భయపడేవారికి ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ మోడ్రన్ మెడికల్ టెక్నాలజీ ఒక సూపర్ సొల్యూషన్ ఇచ్చేసింది
Egg Freezing
లైఫ్‌లో కెరీర్‌లో సెటిల్ అవ్వాలి, నచ్చిన గోల్స్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నవారే ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో పెళ్లిళ్లు, పిల్లల ప్లానింగ్ బాగా లేట్ అయిపోతోంది. మరి వయసు దాటిపోతే ఫ్యూచర్‌లో మాతృత్వానికి ప్రాబ్లెం అవుతుందేమోనని భయపడేవారికి ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ మోడ్రన్ మెడికల్ టెక్నాలజీ ఒక సూపర్ సొల్యూషన్ ఇచ్చేసింది.
ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ ఆప్షన్‌ను హ్యాపీగా సెలక్ట్ చేసేసుకుంటున్నారు. దీంతో అసలీ ప్రాసెస్ ఏంటి, ఖర్చు ఎంత అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.
ఫెర్టిలిటీ క్లినిక్‌ల లెక్కల ప్రకారం ఒకసారి చూస్తే.. ఈ ప్రాసెస్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్ రిట్రీవల్ సైకిల్ కోసం క్లినిక్‌ను బట్టి రూ.1.2 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఆ ప్రాసెస్ తర్వాత తీసిన అండాలను సేఫ్‌గా దాచిపెట్టడానికి అంటే స్టోరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఛార్జ్ చేస్తారు.
ఈ పద్ధతిలో ఖర్చు కాస్త ఎక్కువే ఉన్నా కూడా, భవిష్యత్తులో మాతృత్వాన్ని మిస్ అవ్వకూడదనే ఆలోచనతో చాలామంది యువతులు ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి రెడీ అవుతున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే కొంతమంది మహిళలు కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల వల్ల సంతానోత్పత్తి దెబ్బతింటుందేమోననే అనుమానంతో ముందే తమ అండాలను ఫ్రీజ్ చేసుకుంటున్నారు.
అయితే అండాలను ఫ్రీజ్(Egg Freezing) చేసుకోవాలని అనుకునేవాళ్లు.. 25 నుంచి 32 ఏళ్ల మధ్య వయసులో ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే 35 ఏళ్లు దాటిపోతే అండాల క్వాలిటీ, కౌంట్ రెండు కూడా పడిపోతాయి. ఆధునిక విట్రిఫికేషన్ టెక్నాలజీ వల్ల ఈ ఎగ్స్‌ను ఎంతకాలమైనా క్వాలిటీ తగ్గకుండా భద్రపరచొచ్చు.

ఇలా స్టోర్ చేసిన అండాలతో భవిష్యత్తులో 60 నుంచి 80 శాతం వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో వాడే హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల బాడీ ఉబ్బరం, మూడ్ స్వింగ్స్, రేర్‌గా అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వంటి కాంప్లికేషన్స్ రావొచ్చు.
అంతేకాకుండా చిన్నపాటి బ్లీడింగ్ లేదా ఇన్ఫెక్షన్ ముప్పు కూడా ఉంటుంది. అయినా కూడా మెట్రో సిటీల్లో పెళ్లికి ముందే డాక్టర్లను కలిసి అండాల నిల్వపై(Egg Freezing) అవేర్‌నెస్ పెంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుంది.
Telangana Voters List : తెలంగాణ ఓటర్ల జాబితా రిలీజ్.. మరి మీ పేరుందో లేదో చూసుకోండి?





