Just LifestyleLatest News

Obsession : ఇష్టం హద్దులు దాటితే లవ్ కాదు..ఒకరిపైనే ఎందుకు అంతగా ఫిక్సేట్ అవుతారు?

Obsession : చాలాసార్లు మనుషులు నిజమైన పర్సన్‌ని చూసి లవ్‌లో పడరు.వారి దగ్గరున్న 20 పర్సెంట్ ఇన్ఫర్మేషన్‌తో, మైండ్‌లో వారే క్రియేట్ చేసుకున్న 80 పర్సెంట్ ఇమాజినరీ క్యారెక్టర్‌ని చూసి ఫ్లాట్ అయిపోతారు.

Obsession

కొన్నిసార్లు ఒక వ్యక్తే అవతలి వారి మైండ్‌ని ఫుల్‌గా ఆక్యుపై చేసేస్తుంటారు. నిమిష నిమిషానికి ఫోన్ చూడటం, వారితో మాట్లాడిన చాట్స్‌లోకి వెళ్లి రీ రీడ్ చేయడం,వాళ్లు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే డిస్టర్బ్ అవడం..ఇవన్నీ చాలామంది లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి.

కానీ అసలు ఈ అట్రాక్షన్ ఎప్పుడు అబ్సెషన్‌గా మారుతుందో తెలీక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వేరే పనులేవీ పట్టించుకోకుండా మరీ రోజంతా ఒకే ఆలోచనలో లేదంటే ఒకే వ్యక్తి జ్ఞాపకాల్లో మునిగి తేలుతారో (Fixate) అర్థం కాదు. అది లవ్ ఆ లేక అబ్సెషనా అని ఎలా డిసైడ్ చేయాలనే దానిపైన సైకాలజిస్టులు వివరిస్తున్నారు.

ఒకరి మీదున్న ఫీలింగ్ ఎంత ఇంటెన్స్‌గా ఉంటే, ఆ పర్సన్ మన జీవితంలో అంత ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయిపోతుంటారు. కానీ అది కరెక్ట్ కాకపోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. నిజానికి మనిషి బ్రెయిన్‌కి సగంలో ఆగిపోయిన స్టోరీలంటే పిచ్చి ఇష్టం. ఎవరైనా సగం చెప్పి మిగిలిన సగం తర్వాత చెబుతాం అంటే ఒప్పుకోకపోవడం, నీకొక విషయం చెప్పాలి అంటే వెంటనే ఏంటి ఏంటి అని క్యూరియాసిటీ పెంచుకోవడం చేస్తుంటారు.

అందుకే మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వడం అలాగే ఒక వీకెండ్ బాగా సమయాన్ని స్పెండ్ చేసి తర్వాత కామ్ అయిపోవడం, ఇంకా రిలేషన్‌షిప్‌కి రెడీగా లేనంటూనే పక్కన పెట్టుకోవడం వంటివి చేసినప్పుడే, అవతలి వ్యక్తి మీద థాట్స్ ఇంకా ఎక్కువైపోతాయి. దీనిని ఎమోషనల్ స్లాట్ మెషీన్ అంటారని మానసిక నిపుణులు అంటున్నారు. క్యాసినోలో రివార్డ్ ఎప్పుడు వస్తుందో తెలీక ఎలా ఆడుతుంటారో, రిలేషన్‌షిప్‌లో కూడా క్లారిటీ లేకపోతే కూడా అంతగానే ఎడిక్ట్ అయిపోతారు.

అబ్సెషన్‌కి, లవ్‌కి చాలా తేడా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రేమ మీ ప్రపంచాన్ని పెద్దగా అందంగా చూపిస్తే..అబ్సెషన్ మీ వరల్డ్‌ను చిన్నదిగా చేస్తుంది. అంటే రోజంతా వాళ్ల ముచ్చట్లతోనే, వాళ్ల ఆన్‌లైన్ స్టేటస్ చెకింగ్‌తోనే సరిపోతుంది. ఆరోజు మీకు సంతోషంగా ఉందో లేదో కూడా వాళ్లిచ్చే అటెన్షన్ మీదే ఆధారపడి ఉంటుంది.

కానీ ప్రేమ మీ జీవితాన్ని ఎక్స్‌పాండ్ చేస్తుంది. పార్ట్‌నర్‌తో పాటు మీ పనికి , పర్సనల్ లైఫ్‌కి ఈక్వల్ స్పేస్ ఇస్తుంది. అబ్సెషన్(Obsession) అనేది వాళ్లను ఎలా సొంతం చేసుకోవాలని ట్రై చేస్తే, లవ్ అనేది మాత్రం అసలు వారు ఎలాంటి వ్యక్తి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది.

Obsession
Obsession

నిజం ఏంటంటే.. చాలాసార్లు మనుషులు నిజమైన పర్సన్‌ని చూసి లవ్‌లో పడరు.వారి దగ్గరున్న 20 పర్సెంట్ ఇన్ఫర్మేషన్‌తో, మైండ్‌లో వారే క్రియేట్ చేసుకున్న 80 పర్సెంట్ ఇమాజినరీ క్యారెక్టర్‌ని చూసి ఫ్లాట్ అయిపోతారు. వారు కోపంలో ఎలా ఉంటారో, ప్రాబ్లెమ్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారో కూడా తెలీదు. కేవలం ఫాంటసీలోనే వారిని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకుంటారు.

ఈ లూప్ నుంచి బయటపడాలంటే.. వాళ్ల గురించి బలవంతంగా ఆలోచించడం ఆపేయడానికి ట్రై చేయకూడదు. వారి సోషల్ మీడియా స్టాక్ చేయడంతో పాటు పాత మెసేజ్‌లను మళ్లీ మళ్లీ చదవడం, మ్యూచువల్ ఫ్రెండ్స్‌ని వారి గురించి ఇన్ఫర్మేషన్ అడగడం వెంటనే ఆపేయాలి. ఒక పేపర్ మీద వారు మీకు నిజంగా ఏమిచ్చారు.. మీరు వారి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశారని రెండు కాలమ్స్ రాస్తే, ఆ గ్యాపే నిజం ఏంటో అనేది నిరూపిస్తుంది.

Liechtenstein : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. కానీ ఆ విషయంలో మాత్రం ఈ కంట్రీ టాప్..

Related Articles

Back to top button