Just LifestyleLatest News

Office Politics : ఆఫీస్ పాలిటిక్స్.. ఆఫీసులో ఉండే ఆ 4 రకాల మనుషులు మీ దగ్గరా ఉన్నారా?

Office Politics : ఆఫీస్ పాలిటిక్స్ వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారా? కార్యాలయంలో కనిపించే రకరకాల మనుషులు, వారి రాజకీయ వ్యూహాలు, వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Office Politics

ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకుందామనుకునే వారికి చాలాసార్లు ఆఫీస్ పాలిటిక్స్(Office Politics) పెద్ద సవాల్‌గా మారుతుంటాయి. ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా కొందరి సెల్ఫిష్ పాలిటిక్స్ వల్ల మెంటల్‌గా టెన్షన్ పడాల్సి  వస్తుంది. అసలు ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఎందుకు పుట్టుకొస్తాయి, అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు, వారి బిహేవియర్ వెనుక ఉన్న మానసిక యాంగిల్ ఏమిటనేది సైకాలజీ పరంగా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

ఆఫీసుల్లో కనిపించే రకరకాల మనుషులలో ఫస్ట్ రకం క్రెడిట్ చోరులు. తాము ఏమాత్రం కష్టపడకుండా తోటి కొలీగ్స్ డే అండ్ నైట్ కష్టపడి పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ల క్రెడిట్‌ను తామే దక్కించుకోవడానికి వీరు ప్రయత్నిస్తుంటారు. సైకాలజీ ప్రకారం వీరికి తీవ్రమైన ఆత్మన్యూతతా భావంతో పాటు కష్టపడకుండా ప్రతిఫలం దక్కించుకునే కన్నింగ్ బుద్ధి ఉంటుంది. వారికి సొంతంగా ఎదిగే సత్తా లేక ఎదుటివారి ట్యాలెంట్‌ను అడ్డుపెట్టుకొని పైకి రావాలని చూస్తారు. బాస్ ముందు తామే గొప్పగా కనిపించాలనే తపనే వీరికి మెయిన్ టార్గెట్‌గా ఉంటుంది.

ఇక రెండో రకం మనుషులు వెనుక గోతులు తవ్వే మెంటాలిటీ ఉన్నవారు. బయటికి ఎంతో స్నేహపూర్వకంగా కనిపిస్తూనే మన వ్యక్తిగత విషయాలు, వీక్‌నెస్‌లను సేకరించి అధికారుల వద్ద తప్పుగా చిత్రీకరిస్తుంటారు. వీరు తీవ్రమైన ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్‌తో సతమతమవుతుంటారు. ఇతరులను కిందికి లాగడం ద్వారా తమ ప్లేస్‌ను కాపాడుకోవచ్చనే భ్రమే వీరికి ఎక్కువ.

అలాగే మూడో వర్గం బాస్‌ను ఎప్పుడూ ప్రసన్నం చేసుకోడానికి చూసే భజన బ్యాచ్. వీరికి పనితో ఎలాంటి సంబంధం, టెన్షన్ ఉండదు. కేవలం పై అధికారి ఏది చెబితే దానికి తలాడించడం, ఇతరులపై లేనిపోని చాడీలు చెప్పడమే వీరి మెయిన్ పని. అక్రమ మార్గాల్లో ప్రమోషన్లు పొందాలని చూసే ఇలాంటి మైండ్సెట్ వారి వల్ల ఆఫీస్‌లో వాతావరణం పూర్తిగా విషపూరితంగా మారుతుంది.

ఇక నాలుగో రకం నిశ్శబ్దంగా ఉంటూనే పావులు కదిపే మేధావులు. పైకి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడనట్లు ఉంటారు. కానీ తెర వెనుక పెద్ద పెద్ద గ్రూపులను నడిపిస్తూనే వారిలో ఎవరికి ఎక్కడ చెక్ పెట్టాలో ప్లాన్ చేస్తుంటారు. బాస్‌ను ప్రసన్నం చేసుకుని క్రెడిట్ కొట్టడానికి పక్కదారులను వెతుక్కుంటారు.

వీరంతా చేసే పనులను గమనిస్తే మాత్రం చాలా డేంజర్‌గా ఉంటాయి. తోటి కొలీగ్స్ చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసి నలుగురిలో పరువు తీయడం, మేనేజ్‌మెంట్‌కు రాంగ్‌గా కన్వే చేయడం, ఎలిజిబుల్ పర్సన్స్‌కు ప్రమోషన్లను ఆపడం వంటి పనులు చేస్తుంటారు.

అయితే ఇలాంటి ఆఫీస్ పాలిటిక్స్‌(Office Politics) నుంచి బయటపడటం అసాధ్యమేమి కాదు. ఆఫీసులో ఎవరితోనూ పర్సనల్ విషయాలను పంచుకోకుండా ప్రొఫెషనల్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా దానికి సంబంధించిన ఈమెయిల్స్, రికార్డులను సేవ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో వచ్చే సమస్యలను ఎదుర్కోవచ్చు. అనవసరమైన గాసిప్‌లకు దూరంగా ఉంటూ కేవలం మన బాధ్యతల మీద దృష్టి పెడితే ఈ మెంటల్ టెన్షన్‌ నుంచి బయటపడొచ్చు.

Doomsday : 66 ఏళ్ల క్రితం నాటి ప్రళయం అంచనా.. నిన్నటితో ముగిసిన డూమ్స్‌డే డేట్ ఎందుకు తప్పింది?

Related Articles

Back to top button