Textbooks: పాఠ్యపుస్తకాల్లో దేశభక్తి పాఠాలు.. ఇంకా ఎన్నెన్నో మార్పులు
Textbooks: దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో, గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

Textbooks
విద్య, దేశభక్తి..ఈ రెండు పదాలు ఇప్పుడు కొత్తగా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాదు, వారిలో దేశ పరాక్రమం, ఆత్మగౌరవం వంటి విలువలను కూడా పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో(Textbooks), గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా, ఉన్నత విద్యా పరీక్షలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు కూడా తాజాగా వెలువడ్డాయి.
సీబీఎస్సీ పాఠశాలల్లో 3 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ బోధనాంశంగా ఆపరేషన్ సిందూర్‌ను చేర్చింది. ఈ అంశాన్ని రెండు వేర్వేరు మాడ్యూళ్ల రూపంలో పాఠ్యాంశంగా జోడించింది. ఆపరేషన్ సిందూర్-ఒక వీర గాథ అనే పేరుతో 3 నుంచి 8వ తరగతి వారికి, ఆపరేషన్ సిందూర్- ఆత్మగౌరవం కోసం సాహసిక ఎదురు దాడి అనే శీర్షికతో 9 నుంచి 12వ తరగతి వారికి ఈ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి.
Gold : అక్కడ టన్నుల టన్నుల బంగారం ..భారత్ అవసరాలు తీరుస్తుందా?
భారత్ పౌరులపై పాకిస్థాన్ జరిపిన ఉగ్రదాడి, దానికి భారత్ ఇచ్చిన ధీటైన సమాధానం గురించి ఈ పాఠాల్లో(Textbooks) వివరించారు. దేశం యొక్క వీరత్వం గురించి విద్యార్థులకు తెలియజేసి, వారిలో చైతన్యాన్ని పెంచడమే దీని ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉన్నత విద్యా పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడ్డాయి. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) డిసెంబర్-2025 టీఈఈ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. డిసెంబర్ 1, 2025 నుంచి జనవరి 8, 2026 వరకు ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
అభ్యర్థులు పూర్తి షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా, సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-2025 తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
2025 జులై 28న జరిగిన ఈ పరీక్షల తుది కీని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడికానున్నట్లు సమాచారం. ఈ విధంగా, దేశ విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లో(Textbooks) దేశ చరిత్రను చదువుతూనే, ఉన్నత విద్యలో తమ భవిష్యత్తును నిర్ణయించుకునే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.