Farmer Registry:ఫార్మర్ రిజిస్ట్రీ పని పూర్తి చేశారా? రేపే చివరి తేదీ.. బీ అలర్ట్
Farmer Registry: ఫార్మర్ రిజిస్ట్రీకి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 28 అంటే రేపే చివరి తేదీగా అధికారులు డెడ్ లైన్ విధించారు.
Farmer Registry
మోదీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ఏటా 6 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించి ఇప్పుడు ఒక కీలక మార్పును కేంద్రం తీసుకువచ్చింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే టార్గెట్‌తో ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ(Farmer Registry) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అయితే ఇకపై పీఎం కిసాన్ నిధులు పొందాలన్నా కూడా ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుకోవాలన్నా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ(Farmer Registry)లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇది రైతుల సమాచారాన్ని సేకరించే ఒక డిజిటల్ డేటాబేస్ వంటిది.
దీనిలో అన్నదాతల ఆధార్ నంబర్, వారి భూమి వివరాలు , ఇతర వ్యక్తిగత సమాచారం పొందుపరచబడి ఉంటాయి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన ఒక స్పెషల్ ఐడీ (Unique ID) జారీ చేయబడుతుంది. అసైన్‌మెంట్ భూములు తప్ప పట్టా సాగుభూమి ఉన్న ప్రతి రైతుకు ఈ ఐడీని కేటాయిస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయానికి సంబంధించిన ఏ స్కీమ్ అందాలన్నా ఈ యూనిక్ ఐడీ ప్రామాణికంగా మారుతుంది.
పీఎం కిసాన్ నిధులతో పాటు, పంటల బీమా, సాయిల్ హెల్త్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు, విత్తన సబ్సిడీ మరియు వ్యవసాయ యంత్రాలపై వచ్చే రాయితీలు పొందడానికి ఈ రిజిస్ట్రేషన్ అత్యంత కీలకం. అంటే భవిష్యత్తులో రైతులకు అందే ప్రతీ ప్రభుత్వ లబ్ధి ఈ 11 అంకెల ఐడీ చుట్టూనే తిరుగుతుంది.
ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవడానికి రైతులు కొన్ని ముఖ్యమైన పత్రాలను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు నంబర్, భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ వివరాలు,ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉండాలి.

ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ గ్రామంలో కానీ మండలంలో కానీ స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించి తమ వివరాలను అందిస్తే.. వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకవేళ ఏఈఓ అందుబాటులో లేకపోతే దగ్గరలోని మీ సేవా కేంద్రాలను కానీ కామన్ సర్వీస్ సెంటర్లను (CSC) కానీ సందర్శించి కూడా ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 28 అంటే రేపే చివరి తేదీగా అధికారులు డెడ్ లైన్ విధించారు. ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ పూర్తయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా నేరుగా మీ అకౌంట్లోకి చేరుతుంది.



