Just LifestyleHealthLatest News

Biryani leaves:బిర్యానీ ఆకులు వంటలకే కాదు బ్యూటీకీ కూడా..

Biryani leaves: యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలతో నిండిన బిర్యానీ ఆకులు మీ చర్మానికి, జుట్టుకు ఒక గొప్ప, సహజమైన టానిక్‌లా పనిచేస్తాయి.

Biryani leaves

బిర్యానీ ఆకులు, అంటే తేజ్ పట్టా, అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సువాసనభరితమైన వంటలు. కానీ, ఈ ఆకుల్లో దాగి ఉన్న ఔషధ గుణాలు, మరియు సౌందర్య రహస్యాలు చాలా మందికి తెలియవంటున్నారు నిపుణులు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలతో నిండిన ఈ ఆకులు మీ చర్మానికి, జుట్టుకు ఒక గొప్ప, సహజమైన టానిక్‌లా పనిచేస్తాయి.

బిర్యానీ ఆకుల(Biryani leaves)ను ఉపయోగించి మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు.

సహజ మాయిశ్చరైజర్.. పొడి చర్మంతో బాధపడేవారు బిర్యానీ ఆకుల పొడిని ఆలివ్ నూనె లేదా బాదం నూనెతో కలిపి రాత్రిపూట మసాజ్ క్రీమ్‌లా వాడవచ్చు. ఇది చర్మానికి లోపలి నుంచి తేమను అందించి, పొడిదనం నుంచి రక్షిస్తుంది.

చర్మాన్ని శుద్ధి చేస్తుంది.. బిర్యానీ ఆకుల(Biryani leaves)ను నీటిలో మరిగించి, ఆ వేడి ఆవిరిని (స్టీమ్) ముఖానికి పడితే, చర్మం లోపల పేరుకున్న మురికి తొలగిపోయి, చర్మం శుభ్రపడుతుంది. ఇది చర్మంపై ఒత్తిడిని తగ్గించి, టోన్‌ను మెరుగుపరుస్తుంది.

Biryani leaves
Biryani leaves

ముడతలు, పిగ్మెంటేషన్‌ తగ్గింపు.. ఈ ఆకుల్లోని యాంటీ ఏజింగ్ గుణాలు ముఖంపై ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అలాగే, ఆకులను పొడి చేసి తేనె లేదా యాలకుల పొడితో కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే డార్క్ స్పాట్స్, మరియు మొటిమల మచ్చలు తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది.

జుట్టు సమస్యలతో బాధపడేవారికి బిర్యానీ ఆకులు అద్భుతంగా పని చేస్తాయని అంటున్నారు నిపుణులు.

ప్రకృతి సిద్ధమైన కండీషనర్.. తలస్నానం చేసిన తర్వాత, బిర్యానీ ఆకుల(Biryani leaves)ను మరిగించిన నీటితో తలను కడిగితే (రింస్), జుట్టు సాఫ్ట్‌గా, షైనీగా మారుతుంది. ఇది జుట్టులో ఉండే చిక్కులను (ఫ్రిజ్‌ను) తగ్గిస్తుంది.

చుండ్రు నివారణ.. ఆకులను పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి తలకు, స్కాల్ప్‌కు మసాజ్ చేయడం ద్వారా చుండ్రు (డాండ్రఫ్) సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు స్కాల్ప్‌లోని ఫంగస్, మరియు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

జుట్టు పెరుగుదల.. బిర్యానీ ఆకుల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు వృద్ధిని పెంచుతాయి. టీ ట్రీ ఆయిల్ లేదా రోజ్‌మేరీ ఆయిల్తో కలిపి ఈ ఆకుల నీటిని వాడితే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

పేలు నివారణ.. ఈ ఆకులను మరిగించిన నీటిని తలకు పట్టించడం ద్వారా జుట్టులో ఉన్న పేలు (Head Lice) సమస్యను కూడా సులభంగా నివారించవచ్చు.

సంక్షిప్తంగా, బిర్యానీ ఆకుల్లో ఉండే యూజినాల్, పస్థోలిన్ వంటి సహజ తైలాల కారణంగానే ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఇంత బాగా ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చుతో, సులభమైన హోమ్ రెమెడీస్ కోసం ఈ బిర్యానీ ఆకులను ప్రయత్నించడం ఉత్తమమైన మార్గం.

Cricket: జడేజాకు ప్రమోషన్..నాయర్ ఔట్ విండీస్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button