Revanth Reddy: రేవంత్ ను ఎవ్వరూ కాపాడలేరు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: బిహారీలను చులకనగా మాట్లాడిన ఆయన మరి ఎందుకు తన సాయం కోరారో చెప్పాలన్నారు. అయికే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Revanth Reddy
బిహార్ ఎన్నికలకు జాతీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా… కొత్తగా పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ కూడా తన వ్యూహరచనలో బిజీగా ఉన్నారు. వరుస ప్రచారాలతో బిజీగా ఉన్న పీకే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాడు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వచ్చి మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఓడిస్తానంటూ మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ కూడా రేవంత్ ను కాపాడలేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రెండు మూడు పార్టీలు మారిన రేవంత్ కాంగ్రెస్ లో అదృష్టవశాత్తూ సీఎం అయ్యారని సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ రేవంత్ గెలవరని, సీఎం కాలేరంటూ ధీమాగా చెబుతున్నారు.
నిజానికి పీకే ఈ కామెంట్స్ చేయడానికి పెద్ద కారణమే ఉంది. గతంలో రేవంత్ రెడ్డి బిహార్ ప్రజల గురించి హేళనగా మాట్లాడారు. బిహార్ ప్రజల డీఎన్ఎ తెలంగాణ ప్రజల డీఎన్ఎ కంటే తక్కువే అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అప్పటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రశాంత్ కిషరో తరచుగా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు బిహార్ ఎన్నికల్లో రేవంత్ చేత ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ కిషోర్ రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. గతంలో బిహార్ ప్రజలను కించపరుస్తూ మాట్లాడిన రేవంత్ ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వస్తారంటూ నిలదీశారు. ఒకవేళ వస్తే తరిమికొడతామంటూ హెచ్చరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని ఓడిస్తామంటూ శపథం చేశారు.

రాహుల్ గాంధీ కూడా రేవంత్(Revanth Reddy) ను రక్షించలేరని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి తథ్యమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తనను సాయం అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో రెండుమూడు సార్లు తనను కలిసి సాయం చేయమన్న విషయం మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు.
బిహారీలను చులకనగా మాట్లాడిన ఆయన మరి ఎందుకు తన సాయం కోరారో చెప్పాలన్నారు. అయికే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బిహార్ లో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ కు రేవంత్ ప్రచారం కలిసిరావడం అటుంచితే పీకే చేసిన కామెంట్స్ తో అక్కడి ప్రజల్లో వేరే అభిప్రాయం రావొచ్చన్న టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.