Just EntertainmentJust PoliticalLatest News

Vijay and Rashmika:పెళ్లైన వెంటనే ఢిల్లీకి కొత్త జంట.. విజయ్-రష్మికకు మోదీ, అమిత్ షా ఆశీస్సులు

Vijay and Rashmika: మోదీ ఈ స్టార్ కపుల్‌ను ఆప్యాయంగా పలకరించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని దీవించారు.

Vijay and Rashmika

వివాహ వేడుక ముగిసిన వెంటనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట అందరినీ ఆశ్చర్యపరుస్తూ డైరక్టుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవడం హాట్ టాపిక్ అయింది.
రాజస్థాన్‌లో పెళ్లి వేడుకలు ఇలా పూర్తి అయ్యాయో లేదో అలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నూతన దంపతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

సాధారణ దుస్తుల్లో వెళ్లిన ఈ జంట, అమిత్ షాను కలిసి త్వరలో జరగబోయే తమ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సినిమా షూటింగ్‌ల కంటే వేగంగా వీరి ఢిల్లీ పర్యటన సాగడమే ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది.

Vijay and Rashmika
Vijay and Rashmika

ఆ తర్వాత ఈ జంట ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మోదీ ఈ స్టార్ కపుల్‌ను ఆప్యాయంగా పలకరించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని దీవించారు. టాలీవుడ్ నుంచి వెళ్లిన ఈ యువ జంటకు ప్రధాని కార్యాలయంలో ఇంత ఇంపార్టెన్స్ లభించడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది.

ప్రధాని, హోంమంత్రితో విజయ్-రష్మిక(Vijay and Rashmika) కలిసున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button