Just Andhra PradeshJust PoliticalLatest News

Sai Krishna : ఒక్క ప్రశ్నకూ జవాబివ్వని నాగరాజు.. సాయికృష్ణ కేసులో సిట్ ఏం చేయబోతోంది ?

Sai Krishna : లాకప్‌లో కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడా? ఒకవేళ మరణిస్తే మృతదేహం ఏమైంది? సాయికృష్ణ చనిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారా?

Sai Krishna

ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజుని సిట్ విచారించింది. దాదాపు 8 గంటలపాటు విచారించిన సిట్ అధికారులు నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించింది.

ఐజీ నేరుగా నాగరాజును విచారించారు. పూర్తి ఆధారాలు ముందు పెట్టుకుని విచారించిన సిట్ బృందానికి నాగరాజు ఒక్క ప్రశ్నకూ సమాధానమివ్వలేదని సమాచారం. సిట్ అడిగిన ప్రశ్నలు చూస్తే మార్కాపురం నుంచి సాయికృష్ణ(Sai Krishna)ను ఎందుకు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ బృందం మీకు అప్పగించినట్టు రసీదు కూడా తీసుకుంది కదా? సాయికృష్ణను స్టేషన్లో అలాగే కోర్టులో హాజరు పరిచారా? సాయికృష్ణను కోర్టులో హాజరు పరచకుండా ఏం చేశారని సిట్ ప్రశ్నించగా ఆయన మౌనం వహించినట్టు తెలుస్తోంది.

లాకప్‌లో కొట్టడం వల్లే సాయి కృష్ణ చనిపోయాడా? ఒకవేళ మరణిస్తే మృతదేహం ఏమైంది? సాయికృష్ణ చనిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారా? సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారనీ ప్రశ్నించగా సమాధానాలు చెప్పలేక సీఐ నాగరాజు నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది.

సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడం, ఇప్పటి వరకూ సాయికృష్ణ(Sai Krishna) మృతదేహం దొరక్కపోవడంతో ఇది లాకప్ డెత్ గానే అనుమానిస్తున్నారు. హత్యాయత్నం కేసుగా ఉన్న దీనిని హత్యా నేరంగా పరిగణిస్తూ బీ ఎన్ ఎస్ ఎస్ లోని 103 (1) సెక్షన్ కింద మార్చారు. వీటితో పాటు నిందితులపై 127(4), 127(6), 238 సెక్షన్ల కింద అదనంగా కేసులు నమోదు చేశారు.

Sai Krishna
Sai Krishna

మరోవైపు సీఐ నాగరాజుకు మద్దతుగా కృష్ణలంకలో రోడ్ల పైకి వచ్చి మహిళలు, యువకులు ర్యాలీలు చేస్తున్నారు. సీఐ నాగరాజు వల్లే కృష్ణలంకలో ధైర్యంగా ఉన్నామంటూ చెబుతున్నారు. ఇదిలా ఉంటే విచారణలో నాగరాజు నోరు తెరవకపోవడంతో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళతారనేది చూడాలి. సిట్ అధికారులు ఈరోజు మెజిస్ట్రేట్ ముందు నాగరాజుని ప్రవేశపెట్టనున్నారు.

Silent Treatment : మాట్లాడకుండా ఇచ్చే సైలెంట్ ట్రీట్మెంట్..మీ భాగస్వామిలోనూ ఇది కన్పిస్తుందా?

Related Articles

Back to top button