HealthLatest News

Bones:కాల్షియం టాబ్లెట్లు తీసుకున్నా ఎముకలు ఎందుకు విరుగుతున్నాయి? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇవే!

Bones: ఆసుపత్రులకు వచ్చే రోగులలో చాలామంది రెగ్యులర్‌గా కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటున్నా కూడా, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bones

ఎముకల ఆరోగ్యం గురించి చెప్పగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కాల్షియం. అందుకే ఎముకలు(Bones) బలంగా ఉండాలంటే కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతారు. అయితే, ఆసుపత్రులకు వచ్చే రోగులలో చాలామంది రెగ్యులర్‌గా కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటున్నా కూడా, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాల్షియం మాత్రమే ఎముకల(Bones) రక్షణకు సరిపోదని, దీని వెనుక మరిన్ని కీలక పోషకాలు,లైఫ్ స్టైల్‌లో మార్పులు అవసరమని ఆర్థోపెడిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చాలామంది ఎముకలను(Bones) ఒక నిర్జీవమైన పదార్థంగా భావిస్తారు. కానీ నిజానికి ఎముక అనేది బాడీలోని ఇతర కణజాలాల వలె నిరంతరం విచ్ఛిన్నం అవడం అలాగే తిరిగి నిర్మించబడుతూ ఉండే ఒక సజీవ కణజాలం అని చాలామందికి తెలీదు. అయితే ఈ పునర్నిర్మాణ ప్రక్రియ కంటెన్యూగా జరగాలంటే బాడీకి కేవలం కాల్షియం ఉంటే సరిపోదు. కాల్షియం అనేది ఎముకలకు ఇటుక వంటిది అయితే, ఇటుకులను పేర్చి బలంగా ఉంచడానికి సిమెంట్ వంటి ఇతర పోషకాలు కూడా అవసరం అవుతాయి. అందుకే కేవలం కాల్షియం సప్లిమెంట్ల మీదే ఆధారపడటం వల్ల అనుకున్న రిజల్ట్ ఉండదు.

మీరు ఎంత కాల్షియం తీసుకున్నా, దానిని మీ బాడీ శోషించుకోవాలంటే విటమిన్ డి తప్పనిసరిగా ఉండాలి. విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాల్షియం తీసుకున్నా కూడా అది ఎముకలకు చేరదు. అలాగే ఎముకలకు ఒక నిర్మాణపరమైన బలాన్ని ఇవ్వడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు ఎముకలు పెళుసుగా మారి, చిన్న దెబ్బలకే విరిగిపోయే ప్రమాదముంటుంది.ఇప్పుడు ఎక్కువ మంది ఏసీ రూముల్లో, ఎండ తగలకుండా ఉండటం వల్ల సూర్యరశ్మి తక్కువగా తగిలి విటమిన్ డి లోపానికి గురవుతున్నారు. ఇదే ఇప్పుడు ఎముకల క్షీణతకు ప్రధాన కారణమవుతోంది.

కేవలం ఫుడ్ ద్వారా లేదా మెడిసిన్ ద్వారా పోషకాలు తీసుకుంటే సరిపోదు, ఆ పోషకాలు ఎముకల్లోకి చేరి సాంద్రతను పెంచాలంటే బాడీకి కదలిక ఉండాలి. నడక, యోగా, చిన్నపాటి వ్యాయామాలు చేసినప్పుడు ఎముకలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల బోన్స్ మరింత కాల్షియంను గ్రహించి స్ట్రాంగ్‌గా తయారవుతాయి. కూర్చుని ఉండే రొటీన్ లైఫ్ స్టైల్ వల్ల ఎముకలు తమ సాంద్రతను కోల్పోయి ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. వెయిట్ పెరగడం వల్ల కండరాలు బలహీనపడి, బ్యాలెన్స్ తప్పి పడిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Bones
Bones

అయితే బోన్స్ బలానికి నాలుగు ముఖ్యమైన సూత్రాలను ఇప్పుడు డాక్టర్లు సూచిస్తున్నారు. మొదటిది తగినంత ప్రోటీన్ తీసుకోవడం, ఇది ఎముకల రిపేర్‌కు తోడ్పడుతుంది. రెండోది క్రమం తప్పకుండా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయడం, ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. మూడోది పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఇళ్లలో జారిపడే అవకాశం లేకుండా చూసుకోవడం, సరైన పాదరక్షలు ధరించడం ద్వారా ఎముకలు విరిగిపోవడాన్ని నివారించవచ్చు. నాలుగోది బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడం, దీనివల్ల కీళ్లపై , ఎముకలపైన అనవసరమైన భారం తగ్గుతుంది.

ఏళ్లు పెరుగుతున్న కొద్దీ బోన్ డెన్సిటీ పరీక్షలు (Bone Density Tests) చేయించుకోవడం మంచిది. అలాగే రక్త పరీక్షల ద్వారా కాల్షియం, విటమిన్ డి స్థాయిలను రెగ్యులర్‌గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. బోన్ హెల్త్ అనేది ఒక రోజులో మందులతో వచ్చేది మాత్రం కాదు, ఇది మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం, చేసే ఎక్సర్‌సైజులు, పాటించే అలవాట్ల ద్వారా నిర్మించుకునేది. నష్టం జరిగిన తర్వాత బాధపడటం కంటే, ముందే బోన్ హెల్త్‌పై శ్రద్ధ పెట్టడం మంచిది. కాల్షియంకు ఎముకల ఆరోగ్యంపై పాత్ర ఉన్నా కూడా, అది కేవలం ఒక భాగం మాత్రమేనని గుర్తించాలి.

Gujarat Titans : గుజరాత్ హ్యాట్రిక్..మళ్లీ ఓడిన కోల్ కతా

Related Articles

Back to top button