Strait Of Hormuz : ఇరాన్‌కు లాస్ట్ వార్నింగ్..హర్మూజ్ జలసంధిలో మళ్లీ హై అలర్ట్
Strait Of Hormuz : హర్మూజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ వాదిస్తుంటే.. అది అంతర్జాతీయ జలమార్గమని అమెరికా, గల్ఫ్ దేశాలు కౌంటర్ ఇస్తున్నాయి.
Strait Of Hormuz
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ట్రాన్స్పోర్ట్కు అత్యంత కీలకంగా చెప్పుకునే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న హర్మూజ్(Strait Of Hormuz) జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరిపోయాయి.
శనివారం రోజు ఇరాన్ దగ్గరలోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వాయుసేన ఊహించని రీతిలో భారీ దాడులకు తెగబడింది. ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు, నిఘా కేంద్రాలు, డ్రోన్ గిడ్డంగులతో పాటు సముద్రంలో మైన్లను అమర్చే కేంద్రాలపై అమెరికా సైన్యం మరోసారి విరుచుకుపడింది. పనామా జెండాతో వెళుతున్న కికు అనే భారీ ముడిచమురు నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడమే..ఇప్పుడు ఈ ఘర్షణకు దారితీసింది.
అమెరికా మిలిటరీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఖతార్ ఇంధన క్షేత్రం నుంచి దాదాపు 20 లక్షల బ్యారెళ్ల ఇంధనం లోడ్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు వెళ్తున్న కికు అనే నౌకపై జూన్ 27 వ తేదీ తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్ దాడి జరిగింది.
అయితే ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, చమురు లీకేజీ కాకపోవడంతో పర్యావరణానికి ముప్పు తప్పిందని ప్రాథమిక రిపోర్టులు స్పష్టం చేశాయి.కాగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ దారుణంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆయన ఆరోపించారు.
ఒకవేళ ఇరాన్ కనుక తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశ ఉనికికే ప్రమాదంగా మారబోతోందని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై మాట్లాడిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. సమస్యలు ఏవైనా ఉంటే హింస వీడి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికారు.
అయితే ఈ రెండు రోజుల్లోనే ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి కావడం పరిస్థితి తీవ్రత ఎలా ఉందో తెలియజేస్తుంది. అంతకు ముందు శుక్రవారం జూన్ 26వ తేదీన ఎవర్ లవ్లీ అనే మరో వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ప్రతీకారంగా కూడా యూఎస్ ఆర్మీ ఇరాన్ భూభాగంపై విరుచుకుపడింది.
అయితే ఈ దాడులకు తాము భయపడేది లేదని ఇరాన్ విప్లవాత్మక బలగాలు కూడా ప్రకటించాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను తాము కూడా టార్గెట్ చేశామని వెల్లడించాయి. దీనిలో భాగంగానే బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన 5వ విమాన దళ స్థావరంపై.. ఇరాన్ డ్రోన్లతో ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది.

తాజా ఉద్రిక్తతల వల్ల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన టెంపరరీ శాంతి ఒప్పందం పూర్తిగా ప్రమాదంలో పడింది. హర్మూజ్(Strait Of Hormuz) జలసంధి తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ వాదిస్తుంటే.. అది అంతర్జాతీయ జలమార్గమని అమెరికా, గల్ఫ్ దేశాలు కౌంటర్ ఇస్తున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమంపై కుదిరిన 60 రోజుల టెంపరరీ గడువు ముగియక ముందే ఇలాంటి పరిణామాలు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ నౌకాయాన సంస్థ కొన్ని అత్యవసర సహాయక చర్యలను టెంపరరీగా నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య నౌకలన్నీ ఒమన్ తీరం వెంబడి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నా కూడా అమెరికా నిఘా నీడలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Mistake : మనసుకు నచ్చిన వారి తప్పులను ఎందుకు దాచేస్తాం?..సైకాలజీ సీక్రెట్ ఏంటి?





