Just Andhra PradeshLatest News

AP : వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలోనే వివరాలు

AP:ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు, ప్రభుత్వం గృహ నిర్మాణ ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.

AP

ప్రతి పేద కుటుంబానికి ఒక సొంతిల్లు ఉండాలన్న కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి కోటి మందికి పైగా ప్రజల ఆశలను నిజం చేస్తూ, పది లక్షల గృహాలను పూర్తి చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదులుతున్నారు . కేవలం లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా, దానిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు, ప్రభుత్వం గృహ నిర్మాణ ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. వచ్చే నెలలోనే మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనుండగా, సంక్రాంతి పండుగ నాటికి మరో రెండు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులు ఆదేశించారు.

Love: ప్రేమ కోసం 13 ఏళ్లుగా సముద్రంతో పోరాటం

ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఇంకా ఇళ్లులేని పేద కుటుంబాలను గుర్తించి, పదిహేను రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాన్ని పేద కుటుంబాలకు కేటాయించేందుకు అవసరమైన స్థలాలను కూడా గుర్తించాలని సూచించారు. పెద్ద కుటుంబాల కోసం ఉమ్మడి గృహాలను నిర్మించే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.

AP
AP

రాష్ట్రానికి (AP)పీఎంఏవై (అర్బన్), పీఎంఏవై (గ్రామీణ్), పీఎం జన్మాన్‌ పథకాల కింద మొత్తం 18.59 లక్షలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే 9.51 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గత సంవత్సర కాలంలోనే దాదాపు 2.81 లక్షల ఇళ్లను పూర్తి చేసి ప్రభుత్వం అప్పగించింది. వచ్చే నెలలో మరో 19 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 2,013.50 కోట్లు ఖర్చు చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంతేకాకుండా, దాదాపు 50 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన 4,305 లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పన కోసం రూ. 3,296.58 కోట్లు వెచ్చించనున్నారు. త్వరలో 2.73 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 919.29 కోట్లు చెల్లించనుంది. పీఎం జన్మాన్‌, పీఎంఏవై గ్రామీణ్ కింద నిర్మించిన ఇళ్లకు కూడా రూ. 100 కోట్లు, రూ. 75 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. మరోవైపు, పీఎంఏవై అర్బన్ కింద ఇళ్లు మంజూరైనప్పటికీ 1.84 లక్షల మంది లబ్ధిదారులు ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

New Bar Policy : కొత్త బార్ పాలసీ షురూ..ఎన్ని కీలక మార్పులున్నాయో తెలుసా?

2018లో 104 పట్టణ స్థానిక సంస్థల్లో 4.54 లక్షలకు పైగా టిడ్కో ఇళ్ల(TIDCO houses)కు టెండర్లు పిలవగా, వీటిలో ఇప్పటివరకు 1.77 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో 83,570 ఇళ్లను ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులకు అందించింది. మరో 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ సమగ్రమైన ప్రణాళికలు. వేగవంతమైన పనులతో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నారు.

Related Articles

Back to top button