Just Andhra PradeshLatest News

Lokesh :విక్టోరియా మంత్రికి లోకేష్ విజ్ఞప్తి ..క్రీడలు,పర్యావరణ రంగాల్లో భాగస్వామ్యానికి ఆహ్వానం!

Lokesh : వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని మంత్రి లోకేష్ ప్రశంసించారు.

Lokesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Lokesh), ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లో విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, క్రీడలు, పర్యావరణ రంగాల అభివృద్ధికి విక్టోరియా సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ కోరారు.

హెరిటేజ్ టూరిజం & తీర ప్రాంత అభివృద్ధి.. వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని మంత్రి లోకేష్(Lokesh) ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని గుర్తుచేస్తూ, ఈ రంగంలో సహకారాన్ని కోరారు.

విక్టోరియాలోని గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని  విన్నవించారు.

ఏపీకి 1053 కి.మీ.ల సువిశాల తీరం ఉండటంతో, విక్టోరియాలోని పోర్టు ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీలో తీరప్రాంత స్థితిస్థాపకతపై ఉమ్మడి పరిశోధన(R&D), అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.

విక్టోరియా సర్క్యులర్ ఎకానమీకి తోడ్పాటునిస్తున్న వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజం తరహా ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

క్రీడలు, ఈవెంట్ల నిర్వహణలో సహకారం..ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా సంస్కృతిని, అంతర్జాతీయ ఈవెంట్లను ప్రోత్సహించడంపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

విక్టోరియా మెల్‌బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణకు సహకారం అందించాలి. అలాగే, ఏపీలోని ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిపుణులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి.

ఆంధ్రప్రదేశ్/విక్టోరియా రాష్ట్రాలలో క్రికెట్, హాకీ వంటి క్రీడలకు సంబంధించి ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్‌లు నిర్వహించాలి. స్పోర్ట్స్ సైన్స్పై ఏపీ-విక్టోరియా నడుమ విద్యార్థి మార్పిడి (Student Exchange) కార్యక్రమాలకు సహకరించాలి.

విక్టోరియాలోని ఆల్పిన్ నేషనల్ పార్క్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ట్రెక్కింగ్), పులికాట్ (వాటర్ స్పోర్ట్స్) అభివృద్ధికి చేయూతనివ్వాలి. అడ్వెంచర్ గైడ్స్/రేంజర్ల సర్టిఫికేషన్, నైపుణ్యాభివృద్ధికి విక్టోరియా సంస్థలు సహకరించాలని కోరారు.

విక్టోరియాలో ఆఫ్ షోర్ విండ్, సోలార్ రెన్యూవబుల్ ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో, ఏపీలో యువతకు గ్రీన్ జాబ్స్‌పై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button