Own Business:సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? సక్సెస్ అవ్వడానికి ఈ సూత్రాలు పాటించండి!
Own Business: వ్యాపారంలో ప్రతీ ఒక్కరికీ లాభాలే రావు..దీనిలో ఒడిదుడుకులు రావడం చాలా సహజం. వాటిని చూసి భయపడకుండా తప్పుల నుంచి నేర్చుకోవాలి.
Own Business
చాలా మందికి సొంతంగా ఒక బిజినెస్( Own Business) స్టార్ట్ చేసుకోవాలని ఉంటుంది, కానీ బిజినెస్‌ను ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఆగిపోతుంటారు. బిజినెస్ అంటే కేవలం పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు.. అది ఒక పక్కా ప్లానింగ్ ,ఓపికతో కూడిన పెద్ద ప్రయాణం.
ముందుగా మీరు ఏ రంగంలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద పూర్తి అవగాహనను పెంచుకోవాలి. మార్కెట్ లో ప్రజలకు ఏ వస్తువు లేదా సేవ అవసరమో అన్నది కరెక్టుగా గుర్తించాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ బిజినెస్ లు ఎప్పుడూ సక్సెస్ అవుతాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.అయితే మీ దగ్గర ఉన్న ఐడియా కొత్తగా ఉండాలి లేదా ఉన్న దానికంటే మెరుగ్గా ఉండాలి.

అయితే పెట్టుబడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట్లోనే భారీ మొత్తంలో అప్పులు చేసి బిజినెస్( Own Business) పెట్టడం కంటే, చిన్నగా మొదలుపెట్టి వచ్చిన లాభాలతోనే తిరిగి పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని డెవలప్ చేయడం మంచిది (Bootstrap).
ఏ బిజినెస్‌కు అయినా కస్టమర్ సర్వీస్ అనేది ప్రాణం వంటిది. ఒక్కసారి మీ కస్టమర్ సంతృప్తి చెందితే, వారే పదిమందికి మీ గురించి చెబుతారు.ఇక్కడే మీరు సగం విజయం సాధించినట్లు అవుతుంది.
అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. మీ వ్యాపారం ఏదైనా సరే దానికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ , గుర్తింపు ఉండేలా చూసుకోవాలి. వ్యాపారంలో ప్రతీ ఒక్కరికీ లాభాలే రావు..దీనిలో ఒడిదుడుకులు రావడం చాలా సహజం. వాటిని చూసి భయపడకుండా తప్పుల నుంచి నేర్చుకోవాలి.
నెట్‌వర్కింగ్ పెంచుకోవడం బిజినెస్ వల్ల కొత్త అవకాశాలు వస్తాయి దీనివల్ల బిజినెస్ పెరుగుతుంది. మీ బ్రాండ్ మీద ప్రజలకు నమ్మకం కలిగించడమే మీ మొదటి టార్గెట్ కావాలి. పట్టుదల ఉంటే ఏ వ్యాపారమైనా లాభాల బాట పడుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
అన్నిటి కంటే ముఖ్యమయినది జనాల మాటలను పక్కన పెట్టాలి. పదిమంది పదిరకాలుగా అంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా వ్యాపారంలోని మెలుకువలను క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటూ సాగిపోవాలి. .
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



