Finale: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే రేసులో చివరి వారపు గొడవలు
Finale: తాజాగా జరిగిన ఎపిసోడ్లలో సుమన్ శెట్టి , భరణి ఎలిమినేట్ కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.
Finale
బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ వారంతో ముగియనుంది. హౌస్ లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు (టాప్ 5) మాత్రమే మిగిలారు. వారిలో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ విన్నర్ రేసులో ఉన్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లలో సుమన్ శెట్టి , భరణి ఎలిమినేట్ కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.
చివరి వారం(Finale) కావడంతో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. లేటెస్ట్ ప్రోమో ప్రకారం, బిగ్ బాస్ “వన్స్ మోర్” అనే పేరుతో ఒక బెలూన్ టాస్క్ ఇచ్చారు. ఇందులో జంటలుగా ఆడి, ఒకరి ముఖానికి ఉండే మాస్క్ ద్వారా బెలూన్ ను గాలిలో ఉంచాలి.

ఈ టాస్క్ లో తనూజ మరియు కళ్యాణ్ ఒక టీమ్ గా, ఇమ్మాన్యుయేల్ మరియు సంజన మరో టీమ్ గా ఆడారు. సంచాలకుడిగా వ్యవహరించిన డీమన్ పవన్ తో మిగిలిన వారికి వాదనలు జరిగాయి.
ముఖ్యంగా తనూజ ఆట తీరుపై హౌస్ లో చర్చ నడుస్తోంది. టాస్క్ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె చేసే వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే కళ్యాణ్ మొదటి స్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. తనూజ రెండో స్థానంలో ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే (Finale)ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో అధికారికంగా తెలియనుంది.



